అక్షయ్ కుమార్ బర్త్ డే స్పెషల్ | akshay kumar celebrating 49 birthday

Akshay kumar celebrating 49 birthday

akshay kumar 49 birthday, unknown facts about akshay kumar, Happy birthday khiladi Kumar, intresting facts about akshay kumar, akshay kumar birthday special

akshay kumar celebrating 49 birthday here you didn't know about this action hero.

హ్యాపీ బర్త్ డే కిలాడీ కుమార్

Posted: 09/09/2016 03:29 PM IST
Akshay kumar celebrating 49 birthday

బాలీవుడ్ లో యాక్షన్ చిత్రాలకు బీజం వేసిన నటుడు ఎవరంటే టక్కున గుర్తుచ్చో పేరు అక్షయ్ కుమార్. ఇండియన్ జాకీ చాన్ గా పేరొందిన అక్కీ ఈరోజు 49వ పుట్టిన రోజు జరపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తెలుగు విశేష్ ఈ ఖిలాడీ హీరోకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

అక్షయ్ కుమార్ అసలు పేరు రాజీవ్‌ హరిఓం భాటియా. పంజాబ్ అమృత్ సర్ లో ఇండో కెనడియన్ అయిన హరిఓం బాటియా మరియు అరుణా బాటియా దంపతులకు 1967 సెప్టెంబర్ 9న జన్మించాడు. ఏళ్ల వయసులో బ్యాంకాక్ మార్షల్ ఆర్ట్ 18 ఏళ్ల భారతీయ కుర్రాడు అక్కడ మయ్‌ థాయ్‌ కళను నేర్చకుంటున్నాడు. బాల్యం మొత్తం ముంబైలోని చాందినీ చౌక్ లో గడిపిన అక్కీ 18 ఏళ్ల వయసులో మార్షల్‌ ఆర్ట్స్‌పై మక్కువతో చదువు మానేసి మరీ బ్యాంకాక్ వెళ్లాడు. అక్కడ బతకటం కోసం పగలేమో హోటల్లో వంటవాడిగా గరిటె తిప్పేవాడు. రాత్రుళ్లు మార్షల్‌ ఆర్ట్స్‌లో కఠోర సాధన చేసేవాడు. ఆర్నెళ్లలో అందులోని మెలకువలన్నీ ఒంటబట్టించుకుని ఆరితేరిపోయాడు. గురువుల అభినందనలు, ఆశీర్వాదాలతో స్వదేశానికి తిరిగొచ్చిన ఆ కుర్రాడే తర్వాతి కాలంలో అక్షయ్‌ కుమార్‌గా మారాడు.

యాక్షన్‌ హీరోగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.అక్షయ్‌ కుమార్‌ సినీరంగ ప్రవేశం విచిత్రంగా జరిగింది. బ్యాంకాక్‌ నుంచి తిరిగొచ్చాక అక్షయ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షకుడిగా పనిచేసేవాడు. అతని ఎత్తు, శరీర దారుఢ్యం చూసి అతని శిష్యులలో ఒకడైన ఓ ఫొటోగ్రాఫర్‌ మోడలింగ్ కోసం అక్కీ ఫోటోలతో ప్రయత్నించాడు. అది వర్కవుట్ కావటంతో ఇక సినిమాల వైపు అతని దృష్టి మళ్లీంది. వెంటనే అక్షయ్ కుమార్ అని పేరు మార్చుకుని సినిమాల్లోకి దూకేశాడు. కానీ అభిమానులు మాత్రం ఆ పేరునూ మార్చిపడేసి ఖిలాడీ కుమార్‌గా ముద్దుగా పిల్చుకున్నారు.

1987 లో సినిమా కెరీర్ ప్రారంభం కాగా, 90లో వచ్చిన 'ఖిలాడీ' సిరీస్ అతని కెరీర్ ను పూర్తిగా మలుపు తిప్పింది. యాక్షన్‌ హీరోగా ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ ను అక్షయ్‌ కి కట్టబెట్టింది. 'ఖిలాడీ' సిరీస్‌లో ఏకంగా ఏడు చిత్రాలు చేశాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇక యాక్షన్‌ చిత్రాల్లో తన ఫైట్లతో అదరగొట్టిన ఖిలాడి తర్వాత కొంతకాలం వరుస ఫ్లాపులను చవిచూశాడు. ఆపై రూటు మర్చి కామెడీ కుమార్‌గా మారిపోయారు. 'హేరా ఫేరీ', 'హౌస్‌ఫుల్‌' సిరీస్, 'వెల్‌కమ్‌', 'సింగ్‌ ఈజ్‌ కింగ్‌' లాంటి చిత్రాల్లో విభిన్నమైన కామెడీతో వినోదాలు పంచాడు. ఇంకోవైపు స్పెషల్ ఛబ్బీస్, బేబీ, రుస్తుం లాంటి సీరియస్ సినిమాలతో కూడా మెప్పించాడు. తన  సమకాలీన నటుల్లో ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న అక్కీ బాలీవుడ్ ఏటా అత్యధిక పారితోషకం అందుకునే హీరోలో రెండో స్థానంలో నిలవటమే కాదు, ఈ మధ్య రిలీజ్ చేసిన ఫోర్బ్స్ జాబితాలోనూ చోటు సంపాదించుకున్నాడు. మార్షల్‌ ఆర్ట్స్‌లో వేగంగా పంచ్‌లిచ్చే అక్షయ్‌ అదే వేగం సినిమాలు చేయడంలోనూ చూపిస్తుంటారు. ఏడాదికి నాలుగైదు సినిమాలు తీస్తూ ఆ విషయంలో తనతో పోటీపడగల హీరో ఒక్కరూ లేరని నిరూపిస్తూనే ఉన్నాడు.

2001లో రాజేష్ ఖన్నా డింపుల్ కపాడియాల కూతురు, నటి ట్వింకిల్ ఖన్నాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు అరావ్, కూతురు నీటారా.  ఏజ్ పై బడుతున్న నేచురల్ డైట్, వర్కవుట్స్ తో తన బాడీని కాపాడుకుంటూ చలాకీగా ఉండే ఈ యాక్షన్ హీరో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కొరుకుందాం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : action hero  akshay kumar  49th birthday  

Other Articles