బన్నీని మాత్రం అక్కడ బీట్ చేయలేకపోయాడు | Janatha Garage fails to beat Allu Arjun in malayalam

Janatha garage fails to beat allu arjun yodhavu

NTR fails to beat Bunny, NTR Janatha Garage fails in Kerala, Janatha Garage fails to beat Allu Arjun Sarrainodu malayalam version, Janatha Garage Yodhavu, NTR Allu Arjun Malayalam

Janatha Garage fails to beat Allu Arjun Sarrainodu malayalam version Yodhavu.

బన్నీని మాత్రం బీట్ చేయలేకపోయాడు

Posted: 09/09/2016 11:19 AM IST
Janatha garage fails to beat allu arjun yodhavu

జనతా గ్యారేజ్ విడుదల రోజు టాక్ కి, కలెక్షన్ల సునామికీ ఎటువంటి సంబంధం లేదు. నాన్ బాహుబలి రికార్డులన్నీ చెదరగొట్టిన యంగ్ టైగర్ సెకండ్ ప్లేస్ లో ఉన్న శ్రీమంతుడు కలెక్షన్లను మొదటి వారంలోనే దాటేయటం విశేషం. అంతేకాదు ఫాస్ట్ గా 100 కోట్లు దాటిన తెలుగు చిత్రం(బాహుబలి లెక్కలోకి తీసుకోవట్లేదు) గా రికార్డు సృష్టించింది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లోనూ గ్యారేజ్ సత్తా చాటుతూనే ఉంది. కానీ, ఒక్కచోట మాత్రం దీనికి ఆశించిన ఫలితం రాకపోవటం విశేషం. సరిగ్గా ఇలాంటి టాక్ తోనే మొదలైన అల్లు అర్జున్ సరైనోడు కూడా కలెక్షన్లపరంగా ఈ యేడాది మంచి రికార్డులనే సృష్టించింది. ముఖ్యంగా బన్నీకి బాగా క్రేజ్ ఉన్న మళయాళంలో యోధవుగా 50 డేస్ ఆడటమే కాదు, ఫస్ట్ వీక్ లో ఏకంగా 4.14 కోట్ల కలెక్షన్లు సాధించింది. బాహుబలికి కూడా అక్కడ ఈ ఫీట్ సాధ్యం కాలేదు.

ఇక ఎన్నో అంచనాలతో జనతా గ్యారేజ్ మళయాళంలో భారీ స్క్రీన్లలో విడుదలైంది. మోహన్ లాల్ ఉండటం, స్వయంగా ఆయనే డిస్ట్రిబ్యూట్ చేయటంతో రికార్డులు సృష్టించడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. 200 స్క్రీన్ లలో విడుదలై ఫస్ట్ వీక్ లో కేవలం 3.22 కోట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలా అన్ని ఏరియాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నతారక్ అక్కడ మాత్రం బన్నీ రికార్డును బ్రేక్ చేయలేకపోయాడన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garage  fails  Malayalam  Allu Arjun  Sarrainodu  Yodhavu  

Other Articles