మహేష్ -మురగదాస్ బడ్జెట్ వందకోట్లు దాటేస్తుందా? | mahesh murugadoss movie budget more than 100 crores

Mahesh murugadoss movie budget more than 100 crores

mahesh murugadoss movie, mahesh murugadoss movie budget, mahesh look for murugadoss movie, Mahesh look from Murugadoss movie leaked, mahesh murugadoss budget

mahesh murugadoss movie budget more than 100 crores.

మహేష్ -మురగదాస్ వందకోట్లు దాటనుందా?

Posted: 09/10/2016 10:11 AM IST
Mahesh murugadoss movie budget more than 100 crores

సౌత్ లో ఇప్పుడు మోస్ట్ డిస్కసింగ్ చిత్రంగా మారిపోయింది మహేష్ అప్ కమింగ్ మూవీ. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ చిత్రంపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొనగా, షూటింగ్ నుంచి గోప్యత ప్రదర్శించడటంతో అవి ఇంకా రెట్టింపు అవుతున్నాయి. ఇక బై లింగువల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లని ప్రచారం జరుగుతుండం విశేషం.

ఈ విషయమై మురగదాస్ ను ప్రశ్నిస్తే ఆయన సూటిగా సమాధానం ఇవ్వట్లేదు. "షూటింగ్ ఇప్పుడే కదా మొదలెట్టాం. అప్పుడే ఖర్చు ఎంత అవుతుందంటే ఎలా చెప్పగలం. చివరికొచ్చాక బడ్జెట్టు ఏమిటనేది తేలుతుంది. ఆ లెక్కలన్నీ ఆఖరులోనే తేలతాయి" అన్నాడు నవ్వుతూ. మామూలుగా ఎవరైనా ఒక బడ్జెట్టు వేసుకునే సినిమా మొదలెడతారు. దానికి కాస్త అటు ఇటుగా లెక్కతేలుతుంది. మరి, మురుగదాస్ మాటలను చూస్తుంటే మాత్రం అది మించిపోయేలాగానే ఉంది.

ఇక ఈ చిత్రం కోసం మహేష్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడని ఇది వరకే చెప్పుకున్నాం. మహేష్ ఓ ప్రత్యేకమైన నటుడు. ఏ విషయానైనా కేవలం వినటం ద్వారానే గుర్తుంచుకుంటాడు అని చెప్పుకొచ్చాడు.  ఫిట్ బాడీతో ఆఫ్ షర్ట్స్ టక్ చేసుకున్న ఫోటోలు కొన్ని లీకయ్యాయి కూడా. ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ ఏంటంటే... తమిళ్ లో కూడా మహేష్ సొంతంగా డబ్బింగ్ చెప్పబోతున్నాడంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  AR Murugadoss  Budget  Look  

Other Articles