mega fans enjoy pawan charan pic posted on social media

Pawan kalyan ram charan pic creating tremors

power star pawan kalyan, pawan kalyan ram charan tej, pawan kalyan sardar gabbar singh, mega power star ram charan, pawan-charan pic, pawan charan pic on social media, pawanism

power star pawan kalyan and mega power star ram charan pic creating tremors, which was posted on social media

బాబాయ్-అబ్బాయ్ ఫోటో అదిరింది గురూ..

Posted: 09/04/2016 10:53 AM IST
Pawan kalyan ram charan pic creating tremors

తెలుగు చిత్రరంగంలో బాబాయ్ అబ్బాయ్ అనగానే లేటెస్టుగా గుర్తుకు వచ్చే వారెవరు..? ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకే కాదు.. అఖిలాంధ్ర ప్రేక్షకులకు ఆరాధ్యుడైన ఎన్టీయార్ వారసులను ముద్దుగా బాబాయ్ అబ్బాయ్ అనేవారు. ఆ తరువాత ఎన్టీయార్ అంత ఖ్యాతిని గడించిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం బాబాయ్ అబ్బాయ్ అని పవర్స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లను తెలుగు ప్రేక్షకులు ఆ వరుసతో పిలుస్తున్నారు.

మెగా ఫ్యామిలీలో ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య అంతరాలు ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరిగినా అవన్నీ ఒట్టి పుకార్లే నని ఇప్పటికే పలుమార్లు తేలింది. ఇక తాజాగా పవన్ కల్యాన్ చిన్న కూతురు పొలెన్.. చరణ్తో రాఖీ పండుగ చేసుకోవడం, ఆ తరువాత పవన్ సతీమణి అన్నా లెజ్నోవా.. మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలకు హాజరవ్వడంలాంటివి చూస్తుంటే ఇరు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని అర్థమవుతోంది.

తాజాగా పవన్ పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఫ్యాన్స్ని అమితంగా ఆకట్టుకుంటోంది. 'సర్దార్ గబ్బర్సింగ్' సెట్లో తీసిన ఈ ఫొటో బాబాయి, అబ్బాయిల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూపెడుతోంది. ఎంత ఎత్తు ఎదిగినా.. తన పిల్లలు తల్లిదండ్రుల దృష్టిలో ఇంకా పసివాళ్లే అని చాటుతున్నట్లుగా వుందీ ఫోటో. ఈ ఫోటో షోషల్ మీడియాలో సంచలనంగా మారగా, ఇక పవన్ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ ఫొటోను షేర్ చేస్తూ మురిసిపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  ramcharan tej  social media  sardar gabbar singh  tollywood  

Other Articles