Pawan Kalyan Fans Creates New Record On Twitter

Pawan fans creates new record on twitter

mehrene in allu arjun's movie, mehrene signed duvvada jagannadham, duvvada jagannadham heroine mehrene, allu arjun, mehrene kaur, Kajal Agarwal, Krishna Gaadi Veera Prema Gaadha, harish shanker, tollywood

Mehrene kaur who impressed the audience in Krishna Gaadi Veera Prema Gaadha to romance with stylish star allu arjun in his forth comming movie titled Duvvada Jagannadham (DJ).

పవన్ అభిమానులు ఏం చేసినా రికార్డు బద్దులవ్వాల్సిందే..!

Posted: 09/03/2016 04:03 PM IST
Pawan fans creates new record on twitter

పవర్ స్టార్ పవన్ కల్యాన్ అభిమానులు ఏం చేసినా అందులో ఏదో గొప్పదనం దాగివుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ముక్కుసూటి తత్త్వం, నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టేలా మాట్లాడటం ఇలాంటి అనేక లక్షణాలు ఆయనను తన అభిమానులకు దగ్గర చేసింది. ఆప్యాయతతో వారి బంధాన్ని మరింత ధృడంగా మలించింది. ఎంతలా అంటే అయన అభిమానులు పవన్ కల్యాన్ ను దేవుడిలా కూడా అభివర్ణించేంతలా. అదే పవర్ స్టార్ కోసం వారు ఏం చేసినా రికార్డులు బద్దులయ్యేలా చేస్తుంది. లేదా రికార్డులను క్రియేట్ చేస్తుంది. పవర్ స్టార్ జన్మదిన సందర్భంగా కూడా అలాంటిదే నమోదయ్యింది.

అదేంటంటారా..? పవన్‌ పుట్టినరోజు నేపథ్యంలో ఆయన అభిమానులు ట్విట్టర్‌లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పారు. భారత్‌లో అతిపెద్ద ట్విట్టర్‌ ఫ్యాన్‌ ట్రెండ్‌ను పవన్‌ ఫ్యాన్స్‌ సాధించుకున్నారు. ‘హ్యాపీ బర్త్‌డే పవన్‌ కల్యాణ్‌’ అనే ట్విట్టర్‌ హ్యాష్‌ట్యాగ్‌ మీద గత నెలరోజుల్లో ఏకంగా 5.5 లక్షలకు పైగా ట్వీట్లు నమోదయ్యాయట. భారత్‌లో ఇప్పటికి ఇదే రికార్డు. ఇప్పటి వరకు ఈ రికార్డు అజిత్‌ ఫ్యాన్స్‌ పేరిట ఉండేది. అతని సినిమా ‘ఎన్నై అరిందాల్‌’ హ్యాష్‌ట్యాగ్‌కు గతంలో 5.3 లక్షల ట్వీట్లు వచ్చాయి. దాన్ని పవన్‌ ఫ్యాన్స్‌ దాటేశారు. మొత్తంగా పవన్‌ బర్త్‌డే హ్యాష్‌ట్యాగ్‌ మీద ఆయన ఫ్యాన్స్‌ చేస్తున్న ట్వీట్లు ఆరు లక్షలు దాటే ఆవకాశ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles