పవన్ కళ్యాణ్ కి సంపూర్ణేష్ బాబు మద్ధతు | sampoornesh babu tweet on Pawan Kalyan Tirupathi speech

Sampoornesh babu tweet on pawan kalyan tirupathi speech

sampoornesh babu support to pawan kalyan, sampoornesh pawan kalyan, pawan kalyan Sampoornesh Babu, sampoo twwet on pawan, Sampoo support to AP special status

sampoornesh babu support to pawan kalyan on special status, tweet in twitter.

పవన్ స్పీచ్ పై సంపూ ట్వీట్ ఎలా మిస్సయ్యాం?

Posted: 08/30/2016 05:54 PM IST
Sampoornesh babu tweet on pawan kalyan tirupathi speech

తిరుపతి సభలో అగ్రనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారమే రేపాయి. అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టడమే కాదు, నెమ్మదిగా ప్రత్యేక హోదా అంశంపై పోరాటం చేసేందుకు ముందుకు కదులుతున్నాయి. అయితే రాజకీయాల పరంగా ఏమోగానీ, సినీ సెలబ్రిటీలు ఈ విషయంలో ఇంతదాకా స్పందించలేదనే చెప్పాలి. కానీ, టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు ఏకంగా పవన్ కు ఈ విషయమై ఓ లేఖ రాశాడు.
 
ఏపీకి ప్రత్యేకహోదా పై మాట్లాడిన పవన్ కు తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని సంపూ పేర్కొన్నాడు. ‘నేను తెలంగాణలో పుట్టాను. నా సోదర తెలుగు రాష్ట్ర ప్రజలు ఇంత కష్టాల్లో ఉన్నారని, వారి గుండెల్లో ఇంత ఆగ్రహం ఉందని పవన్ కల్యాణ్ గారి స్పీచ్ ద్వారా తెలిసి గుండె బరువెక్కింది. రాష్ట్రాలు వేరైనా, కష్టం వచ్చినప్పుడు అందరం ఒక్కటే, సీమాంధ్రుల బాధను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడికి ఉంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు. వారు కొంటున్న సినీమా టిక్కెట్ డబ్బుతోనే మనం బతుకుతున్నాం. పవన్ కల్యాణ్ గారి ఉద్యమంలో నేను ఒక గొంతుకనవుతాను. దీనివల్ల ఏ ఉపయోగమూ జరగకపోవచ్చు. కానీ, నా వల్ల మరొకరు ధైర్యంగా ముందుకు రావొచ్చుగా’ అంటూ సంపూ ఆ లేఖలో రాశారు.

సున్నిత సమస్య కావటంతో కామెంట్లు చేసి ఇబ్బందులు ఎదుర్కోవటం ఎందుకని కొందరు సెలబ్రిటీలు ఫీలయిపోతున్న వేళలో, ప్రత్యేక హోదాపై మనమంతా పవన్ కళ్యాన్ గారికి మద్ధతు తెలపాలని సంపూ చేసిన ఈ ట్వీట్ పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. సభ జరిగిన తర్వాతే ట్విట్టర్ లో పేర్కొన్న ఈ సందేశం ఆరోజే ట్వీట్ చేసినప్పటికీ, ఆలస్యంగా వెలుగులోకి విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sampoornesh babu  Special Status  Pawan Kalyan  Tweet  

Other Articles