షూటింగ్ ఆగిపోవటంతో క్రికెట్ ఆడుతున్న బాహుబలి టీం | baahubali team played cricket last day war shoot due to rain

Baahubali team played cricket last day war shoot due to rain

Rajamouli played cricket, Baahubali team played cricket, heavy rain

Baahubali team played cricket last day war shoot due to rain, Rajamouli posted video.

బాహుబలి టీం టైంపాస్ ఎలా ఉందంటే...

Posted: 08/30/2016 04:29 PM IST
Baahubali team played cricket last day war shoot due to rain

దేశమంతా ఓవైపు బాహుబలి కోసం ఆత్రుతగా చూస్తుంటే... నెలరోజులపైగానే యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు జక్కన్న. సుమారు 2 వేల మంది, 45 రోజులుగా నిరాటంకంగా జరిగిన షూటింగ్ లో ఇవాళ సడన్ గా వెరైటీ సీన్లు దర్శనమిచ్చారు. అయితే అర్థాంతరంగా షూటింగ్ నిలిపేసిన యూనిట్ ఎంచక్కా క్రికెట్ ఆడుకుంటూ కూర్చుంది.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ‘బాహుబలి-2’ యుద్ధ సన్నివేశాల ఆఖరి రోజు చిత్రీకరణ జరగాల్సి ఉంది. అయితే, వర్షం భారీగానే పడిన కారణంగా సెట్ తడిసిపోవడంతో షూటింగ్ ఆగిపోయింది. ఇక చేసేదేమిలేక యూనిట్ సభ్యులు క్రికెట్ ఆడుకున్నారంటూ రాజమౌళి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. ఆఖరి రోజు షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు, ఎక్కడ మొదలు పెడతామో తర్వాత ప్రకటిస్తామని ఇప్పటికే రాజమౌళి అనౌన్స్ చేశాడు కూడా.

తర్వాత పాల్గొనబోయేది యంగ్ రెబల్ స్టార్ కి ఆఖరి షెడ్యూల్, అది త్వరగా పూర్తి చేయించి ప్రభాస్ ను తర్వాతి చిత్రానికి అనుమతిస్తాడంట. కాగా, 2017 ఏప్రిల్ 28న ‘బాహుబలి-2’ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న జరుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles