గ్యారేజ్ తో ఎన్టీఆర్ కి అరుదైన అవకాశం | NTR prove chance his acting with mohanlal in janatha Garage

Ntr prove chance his acting with mohanlal in janatha garage

NTR prove chance his acting, NTR mohan lal who is highlight, NTR with complete actor, Complete actor Mohan Lal, Mohan Lal about NTR, Mohan Lal NTR, NTR acting prove, NTR janatha garage acting

NTR prove chance his acting with mohanlal in janatha Garage.

యంగ్ టైగర్ కి అసలైన ఛాలెంజ్ అదే...

Posted: 08/31/2016 10:08 AM IST
Ntr prove chance his acting with mohanlal in janatha garage

జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో మంచి నటుడు అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ ఆరంభంలోనే మెచ్యూర్డ్ పాత్రలు చేసి తానేంటో చూపించాడు. అయితే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న జూనియర్ ఈ మధ్య కాన్సెప్ట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నాడు. టెంపర్.. నాన్నకు ప్రేమతో లను గమనిస్తే ఇదే అర్థం అవుతుంది కూడా. ఆయా సినిమాలతో హిట్లు అందుకోవటమే కాదు, నటనలో మరో మెట్టు పైకి ఎక్కాడు. ప్రస్తుతం రాబోతున్న జనతా గ్యారేజ్ కూడా ఈ కోవలోనిదే.

Janatha Garage Review 

దీని గురించి అడిగితే ఎన్టీఆర్ ఏమంటున్నాడంటే 'మార్పు అనేది ఒక సంఘటన వచ్చేది కాదు. నాన్నకు ప్రేమతో ముందు చాలానే సినిమాలు చేసినా.. అటు కలెక్షన్స్ పరంగాను.. ఇటు యాక్టింగ్ పరంగాను శాటిస్ఫై చేయలేకపోయాయి. నెంబర్ గేమ్స్ లాంటివి ఇష్టం ఉన్నా లేకపోయినా.. అందులోనే ఉన్నపుడు రిసీవ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు చేస్తున్న సినిమాలపై మాత్రం చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా' అంటున్నాడు ఎన్టీఆర్. అలాగే తను చేసే పాత్రలను కలకాలం గుర్తు పెట్టుకోవడం అనేది.. తన ఇష్ట ప్రకారం కంటే.. ఆడియన్స్ టేస్ట్ అనుసరించి ఉంటుందని.. కెరీర్ చివరకు వచ్చే నాటికి.. జనాలు తన సినిమాల్లో ఎన్నింటిని గుర్తు పెట్టుకుంటారో చెప్పలేనని అంటున్నాడు ఎన్టీఆర్.

ఆ ఒక్క విషయంలోనే టెన్షన్ 

ఇక ఇప్పటిదాకా చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే గ్యారేజ్ మరోక ఎత్తు అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఇందులో ఉంది మోహన్ లాల్ కాబట్టి. మోహన్ లాల్ ‘కంప్లీట్ యాక్టర్’ అని దేశమంతా ఒప్పుకుంది. ఆ మాటే ఆయనకు బిరుదుగా మారిపోయింది. తెరమీద మోహన్ లాల్ ఉంటే.. మిగతా నటులందరూ పక్కకు వెళ్లిపోవాల్సిందే. తన నటనతో అంతగా హైలైట్ అవుతాడు మోహన్ లాల్. మరి అలాంటి నటుడి ముందు ఎన్టీఆర్ ఎలా పెర్ఫామ్ చేస్తాడు. ఆయనకు ఎలాంటి పోటీ ఇస్తాడు అన్నదే ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఇలాంటి పాత్రల విషయంలో హైప్ రేపటం, తీరా సినిమాలో ఒకటి రెండు డైలాగులతో డమ్మీ పాత్రకు పరిమితం చేయటం ఇదివరకు చాలా సినిమాల్లో చూశాం. కానీ, గ్యారేజ్ లో లాల్ పాత్ర చాలా బలంగా ఉంటుందని.. దానికి చాలానే ప్రాధాన్యం ఉంటుందని దర్శకుడు కొరటాల చెప్పాడు. అంటున్నారు. ఈ లెక్కన మళయాళ స్టార్ హీరోతో తారక్ పోటీ పడి ఎలా నటించబోతున్నాడా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Mohan lal  acting  Janatha Garage  

Other Articles