రాంచరణ్ ధ్రువకి దసరా సెంటిమెంట్ | cherry confident on dhruva success

Cherry confident on dhruva success

Ram Charan Dhruva Release Date, Cherry Dhruva Sentiment, Cherry Dussera Sentiment, mega fans on Charan Dhruva, Dhruva movie updates, Charan confident on Dhruva, Charan Dhruva release date change, Ram Charan Dussera Movies

cherry confident on dhruva success and breaks his dussera failure sentiment.

చెర్రీ చేయబోయేది ఛాలెంజేనా?

Posted: 08/27/2016 04:57 PM IST
Cherry confident on dhruva success

మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చి తండ్రి పేరుతోనే పైకి వస్తున్నాడు అన్న విమర్శలు ఎదుర్కుంటున్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. ఫ్లాప్ సినిమాలతో సైతం 40 కోట్లు రాబట్టగల సత్తా ఉన్నప్పటికీ మగధీర తర్వాత ఆ స్థాయి హిట్ ను అందుకోలేకపోతున్నాడు. ఇలాంటి సమయంలో ధ్రువ చెర్రీ కెరీర్ కు ఎంతో కీలకంగా మారింది.

అయితే దసరా బరిలో ఈ చిత్రం నిలపటంపై ఇప్పుడు రిస్క్ చేస్తున్నాడేమో అని అంతా చర్చించుకుంటున్నారు. దీనికి సెంటిమెంట్ ను సాకుగా చూపుతున్నారు. పండగ సీజన్లో అగ్రహీరోల మాదిరిగా పెద్ద సినిమాలను నిలపటంలో ముందుండే చరణ్ సగం ఎదురు దెబ్బలే తిన్నాడు. సంక్రాంతి పండక్కి వచ్చిన ఎవడు, నాయక్ లు హిట్లు కాగా, దసరా కు వచ్చిన చిత్రాలు పెద్దగా ఆడలేదు. రెండేళ్ల క్రితం వచ్చిన గోవిందుడు అందరి వాడేలే యావరేజ్ గా నిలవగా, గతేడాది వచ్చిన బ్రూస్ లీ అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

దీంతో ధ్రువను దసరాకే అనౌన్స్ చేయటంతో చెర్రీ మరోసారి దెబ్బతింటాడంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే ఎక్కడ పొగొట్టుకున్నామో అక్కడో రాబట్టుకోవాలి అన్న సూత్రాన్ని వంటబట్టిచుకున్న మెగాతనయుడు ఎలాగైనా ఈసారి హిట్ కొట్టి తీరతానని చాలెంజ్ చేస్తున్నాడు. అదీ మ్యాటర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Dhruva  Dussera  release  

Other Articles