గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రజనీకాంత్ | gautham menon to direct Rajanikanth after robo sequel

Gautham menon to direct rajanikanth after robo sequel

Gautham Menon Rajanikanth, Superstar Gautham Menon, Rajanikanth after Robo sequel, Rajani next with, classic director for Superstar, Enai Noki Paayum Thota directorTW

Gautham Menon to direct Rajanikanth after robo sequel.

రోబో 2 తర్వాత రజనీ సినిమా ఏంటంటే...

Posted: 08/27/2016 03:54 PM IST
Gautham menon to direct rajanikanth after robo sequel

సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేయడానికి దర్శకులంతా క్యూ కడుతుంటే, తలైవా మాత్రం ఎవరూ ఊహించని రీతిలో షాకులు ఇస్తూనే ఉంటాడు. ఓవైపు సీనియర్ దర్శకులతోపాటే, ఇంకోవైపు యంగ్ జనరేషన్ ను కూడా ప్రొత్సాహం అందిస్తుంటాడు. రజనీతో చేసిన ఆ ఒక్క సినిమా వారి క్రేజ్ ను అమాంతం మార్చేస్తుంది. దానికి ఉదాహరణే కబాలి.

కబాలి దర్శకుడు పా రంజిత్ ఆ చిత్ర ఫలితంతో సంబంధం లేకుండా కోలీవుడ్ లో ఇప్పుడు బిజీ దర్శకుడిగా మారిపోయాడు. సూర్య, విశాల్ ఇలా స్టార్లంతా అతని దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమైపోయారంటే అదంతా తలైవా ప్రొత్సాహమే. ప్రస్తుతం రజనీ శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన తర్వాతి చిత్రంపై ఓ స్పష్టతకు వచ్చినట్లు సమాచారం.

క్లాసిక్ చిత్రాలతో ఆకట్టుకునే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ తర్వాతి చిత్రం ఉండబోతుందనే సంకేతాలు అందుతున్నాయి. అనువాద చిత్రాల ద్వారా .. స్ట్రైట్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు గౌతమ్ సుపరిచితుడే. ప్రస్తుతం ఆయన ధనుష్ కథానాయకుడిగా ఒక ఎనయి నోకి పాయుమ్ తోట అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇందులో రానా కూడా ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇలా ఉండగానే రజనీ నుంచి ఆయనకు పిలుపు వచ్చిందని సమాచారం. దీంతో అందుకు అవసరమైన కథను సిద్ధం చేసే పనిలో ఆయన బిజీగా వున్నాడని చెబుతున్నారు. అందరు డైరక్టర్లు రజనీ వైపు చూస్తుంటే... ఆయన చూపు మాత్రం గౌతమ్ పడిందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajanikanth  Gautham Menon  Enai Noki Paayum Thota  

Other Articles