జనతా గ్యారేజ్ పై ఉమెర్ సంధు | Umair Sandhu about Janatha Garage review

Umair sandhu about janatha garage review

NTR fans tension with Umair Sandhu, Umair Sandhu Janatha Garage review, Janatha Garage first review, Janatha Garage review, NTR Janatha Garage review, Umair Sandhu NTR review

NTR fans tension with Umair Sandhu about Janatha Garage blockbuster review.

ఫస్ట్ రివ్యూతో టెన్షన్ టెన్షన్

Posted: 08/27/2016 11:15 AM IST
Umair sandhu about janatha garage review

ఓవైపు జనతాగ్యారేజ్ రిలీజ్ దగ్గర పడిపోతుంటే అభిమానుల్లో అంచనాలు ఆకాశానికి చేరిపోతున్నాయి. సెన్సార్ బోర్డు నుంచి వస్తున్న లీక్ ల ఆధారంగా సినిమా హిట్ అయి తీరుతుందనే అభిమానులు ఆశగా చూస్తున్నారు. కేవలం 71 సన్నివేశాలతో, 2గంటల 41 నిమిషాల నిడివితో యూ బై ఏ సర్టిఫికెట్ పొందింది. చెట్లు, మనుషుల ప్రాణాలు ఒకటేనన్న బలమైన థీమ్ కాన్సెప్ట్ తో కొరటాల శివ రూపొందించిన ఈ చిత్రంపై యంగ్ టైగర్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.

అయితే ఈలోపు సినిమా గురించి వస్తున్న ఫస్ట్ పాజిటివ్ రివ్యూ కాస్త కలవరపాటుకు గురిచేస్తుంది. అదేంటీ అంటారా? ఎందుకంటే అది ఇచ్చింది మాములు వ్యక్తి కాదు.  దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు, ఇండియన్ సినిమా మ్యాగజైన్ ఎడిటర్ ఉమెర్ సంధు. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అనుకుంటా. గతంలో ప్రతీ చిత్రానికి రిలీజ్ లకు ముందే 4, 5 లకు తక్కువ కాకుండా రేటింగ్ లు ఇచ్చిన ఘనత ఆయనది. ఆపై వాటి ఫలితం ఏమైందో మనందరికీ తెలుసు. అంతేందుకు రీసెంట్ గా వచ్చిన ఫ్లైయింగ్ జెట్ రిలీజ్ అయి బోల్తా పడ్డాక కూడా సూపర్ హిట్ అనే చెప్పుకుంటున్నాడు. తెలుగులో సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, రీసెంట్ గా కబాలి లపై ఆయన దగ్గరి నుంచి బ్లాక్ బస్టర్ లు అన్న టాక్ తోనే బయటికి వచ్చాయి. ఈ కారణంతో ఆయన గ్యారేజ్ పై రివ్యూ పెట్టడం అభిమానుల్లో కాస్త కలవరం రేపుతోంది.

ఇంతకు ముందు ఈయన ట్రైలర్ పై కామెంట్ చేయగా, ఇప్పుడు ఫస్ట్ కాపీ చూడబోతున్నానంటూ పోస్ట్ చేయటం విశేషం. సూపర్ హిట్ ట్రైలర్, పవర్ ఫుల్ తారాగణం, అభిమానుల క్రేజ్, పవర్ పుల్ కథ అంటూ ఓ ట్వీట్ వేశాడు. అంతేకాదు మంగళవారం జనతాగ్యారేజ్ రివ్యూ తన ఫేస్ బుక్ పేజీలో చూస్కోండంటూ మరో ట్వీట్ చేశాడు. మరోవైపు ఉమర్ సంధు జోస్యంను నమ్ముకోలేదని, కథలో దమ్మును నమ్ముకుంటున్నామని చెబుతున్నారు.

Related News:


గ్యారేజ్ టాక్ బయటికి వచ్చేస్తోంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garage  Review  Umair Sandhu  

Other Articles