షాహిద్ కపూర్ కు కూతురు పుట్టింది | Shahid Kapoor blessed with baby girl

Shahid kapoor blessed with baby girl

Shahid Kapoor blessed with a baby girl, Shahid Kapoor couple, Shahid Kapoor with daughter, Shahid wife daughter, Mira Rajput blessed with a baby girl

Shahid Kapoor and wifey Mira Rajput blessed with a baby girl

షాహిద్ కు కూతురు పుట్టింది

Posted: 08/27/2016 10:34 AM IST
Shahid kapoor blessed with baby girl

బాలీవుడ్ లో మరో హీరో తండ్రిగా ప్రమోషన్ పొందాడు. హీరో షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ దంపతులకు పండంటి కూతురు జన్మించింది. హిందూజ హెల్త్ కేర్ హాస్పిటల్‌లో ఆగస్ట్ 26 సాయంత్రం 7:56 ని.లకు మీరా బేబికి జన్మనివ్వగా కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు.

తమ కుటుంబంలోకి బేబి గార్ల్ రావడం మాకెంతో ఆనందంగా ఉందని, ఆ సంతోషాన్ని వ్యక్తం చేయలేకపోతున్నానంటూ ట్వీట్ చేశాడు షాహిద్. అంతేకాక తమకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశాడు. మరో రెండు రోజుల్లో తల్లికూతుళ్లు వారిద్దరు డిశ్చార్జ్ కానున్నట్లు తెలిపాడు.

కాగా, 2003లో వచ్చిన ఇష్క్ విష్క్ చిత్రంతో బాలీవుడ్ కి హీరోగా పరిచయమైన షాహిద్ తక్కువ టైంలోనే ఎక్కువ సినిమాలు తీసిన హీరోగా ఘనత సాధించాడు. సహనటి కరీనాకపూర్ తో కొన్నాళ్లూ ప్రేమాయణం సాగించి, ఆపై అనివార్య కారణాలతో విడిపోయారు. 2014లో వచ్చిన హైదర్ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా  ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు.  గతేడాది జూలై 25న షాహిద్ కపూర్, మీర్జా రాజ్ పుత్ లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahid Kapoor  Mira Rajput  bless  baby girl  

Other Articles

Today on Telugu Wishesh