హోమోసెక్సువాలిటీ గురించి కరణ్ జోహార్ | Bollywood Director cum Produver Karan Johar on homosexuality

Karan johar on homosexuality

karan Johar Homosexuality, karan about Dostana, Karan Dostana with, Karan Dostana Hero

Bollywood Director, Producer Karan Johar on homosexuality.

హోమోసెక్సువాలిటీ గురించి కరణ్ జోహార్

Posted: 08/20/2016 02:18 PM IST
Karan johar on homosexuality

ఫారిన్ దేశాల సంగతి ఏమోగానీ మన దేశంలో మాత్రం గే సంస్కృతి పట్ల జనాల్లో అవగాహన ఇంకా తక్కువనే చెప్పాలి. అయితే తన సినిమాల్లో ఎక్కడో ఒక దగ్గర వాడటం ద్వారా ఈ హోమో సెక్సువాలిటీని బాగా పెంపోదిస్తుంటాడు.. సారీ...! ప్రచారం చేస్తుంటాడు బాలీవుడ్ దర్శకుడు కమ్ నిర్మాత కరణ్ జోహర్.

ఈ కాన్సెప్ట్ తో 2008లో ఏకంగా దోస్తానా అంటూ అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో ఓ సినిమానే తీసిపడేశాడు. తుమ్మెద-తుమ్మెద రిలేషన్ షిప్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాపై రిలీజ్ కు ముందు విమర్శలు ఎదురైనా... విడుదలయ్యాక మాత్రం ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఈ మధ్య వచ్చిన కపూర్ అండ్ సన్స్ చిత్రంలో కూడా ఈ ప్రయోగమే చేశాడు.

ఎందరో స్టార్ల ఈ సినిమా కోసం అడిగాం, కానీ, ఎవరూ ముందుకు రాలేదు. ఫవాద్ ఖాన్ ఒప్పుకోవటంతో హ్యాపీగా ఫీలయ్యాం. మొత్తానికి సినిమా సూపర్ హిట్ అయ్యింది అది చాలూ అంటున్నాడు కరణ్. వేదికలపై హోమో సెక్సువాలిటీ గురించి ఓపెన్ గా మాట్లాడే కరణ్, దాని గురించి పెద్ద క్లాసే పీకుతున్నాడు. గే లేదా లెస్బియన్ అనేవి మంచి ఫీలింగ్స్. కానీ, మన సినిమాలో అవి కామెడీ సీన్లుగా మారిపోతున్నాయి. నిజానికి అవి ఎదుటివారిపై ఫీలింగ్స్ ను తెలియజేసేవి, వాటిని సీరియస్ గా చూపించే ప్రయత్నం చేయబోతున్నా... త్వరలో మరో పూర్తిస్థాయి సినిమాతోనే వస్తానంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karan johar  Dostana  homosexuality  movie  

Other Articles