అన్నమయ్య సినిమాపై శోభారాజ్ కామెంట్లు | Singer Shobha Raju Shocking Comments on Nag's Annamayya movie

Singer shobha raju shocking comments on nag s annamayya movie

Devotional Singer Shobha Raju, Shobha Raju comments on Annamayya movie, Shobha Raju Annamayya movie, Singer fire on Nag Annamayya, Singer Fire on Nagarjuna movie, Annamayya movie controversy, Devotional Singer comments on Nag Movie

Singer Shobha Raju Shocking Comments on Nag's Annamayya movie.

నాగ్ మూవీపై సింగర్ షాకింగ్ కామెంట్లు

Posted: 08/20/2016 04:53 PM IST
Singer shobha raju shocking comments on nag s annamayya movie

హిస్టారికల్ నేపథ్యంలో వచ్చే సినిమాల్లో లోటుపాట్లు చాలా వరకే ఉంటాయి. సుదీర్ఘ అధ్యయనం చేసి గుణశేఖర్ రూపొందించిన రుద్రమదేవి సినిమాలోనూ చాలా తప్పులే వెతికారు సినీ క్రిటిక్స్. అయితే ఇంతలా సాంకేతిక పరిజ్నానం ఇంకా అభివృద్ధి చెందని సమయంలోనే రాతపూర్వక ఆధారాలు, పెద్దలు చెప్పిన విషయాలను బేరీజు వేసుకుని గాయకుడు తాళ్లపాక అన్నమాచార్యుల పై చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.

అప్పటిదాకా ఓ టైప్ ఆఫ్ సినిమాలతో దూసుకెళ్తున్న నాగార్జునను వేంకటేశ్వరుడి భక్తుడిగా, సెకండ్ ఇన్నింగ్స్ లో సుమన్ ని కలియుగ ప్రత్యక్ష దైవంగా... ఇలా ఈ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన అన్నమయ్య సినిమా అప్పట్లో సంచలనం. ముఖ్యంగా సామాన్య జనం కూడా పాడుకునే విధంగా అద్భుత బాణీలతో చిత్రాన్ని రూపొందించారంటూ ప్రశంసలు కూడా లభించాయి. సౌత్ లో చాలా అవార్డులనే అందుకుంది అన్నమయ్య. అయితే ఈ సినిమా అసలు సరిగ్గా లేదని, అంతా కల్పిత పాత్రలతో కానిచ్చారంటూ షాకింగ్ కామెంట్లు ఇప్పుడు వస్తున్నాయి.

ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, అన్నమాచార్యని సంకీర్తనల ఆలాపనలో ఆరితేరిన ప్రముఖ గాయని శోభారాజ్. కృష్ణా పుష్కర మహోత్సవాలలో భాగంగా కళావేదికపై తన సంకీర్తనా గానాన్ని వినిపించేందుకు వచ్చిన శోభారాజ్ ఈ విషయాలను మీడియాకు తెలియజేశారు. అన్నమయ్య సినిమాలో అన్నమయ్య పాత్ర, సాళువ నరసింహరాయలు పాత్ర తప్పుదారి పట్టాయి. సాళువ రాయలను హాస్య పాత్రగా దర్శకుడు చిత్రీకరించాడు. ఇక వాగ్గేయకారుడు అన్నమయ్య తన ఇద్దరు భార్యల వెంట పడటం సుద్ధ తప్పు అంటూ చెప్పారు. ఆయన జీవితాన్ని సుదీర్ఘ అధ్యయనం చేసి 1985లో 108 ఎపిసోడ్ లతో ఒక సీరియల్ రాశాను. దూరదర్శనలో ఆరు ఎపిసోడ్ లతో మరొకటి నిర్మించా, కనీసం వాటిని ప్రామాణికంగా తీసుకుని అయినా దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించాల్సింది అంటూ ఆమె వివరించారు.

అయితే ఆ సినిమా టైంలో చిత్రంలోని పాటలు తనతో పాడించాలంటూ అన్నమయ్య చిత్ర యూనిట్ ను సంప్రదించారని, అందుకు వారు ఒప్పుకోకపోవటంతో ఆ సమయంలో తన అసంతృప్తి పలు వేదికలపై పరోక్షంగా వెల్లగక్కారనే ఓ టాక్ ఉండేది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devotional Singer  Shobha Raju  Nagarjuna  Annamayya  comments  

Other Articles