శివకార్తీకేయన్ తో సమంత | Samantha to pair up with Sivakarthikeyan

Samantha to pair up with sivakarthikeyan

Samantha to pair up with Sivakarthikeyan, Samantha Sivakarthikeyan, Sivakarthikeyan Samantha

Samantha to pair up with Sivakarthikeyan Confirmed.

సమంత ఎందుకింత దిగజారింది?

Posted: 08/20/2016 01:43 PM IST
Samantha to pair up with sivakarthikeyan

అతితక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగిన సమంత, కెరీర్ ముగిసిపోతుందన్న తరుణంలో తమిళ్ లో ఫెవరెట్ హీరోయిన్ గా మారింది. అయితే త్వరలో మూడుముళ్లు వేయించుకోబోతుందన్న వార్తల నేపథ్యంలో ఎలాంటి సినిమాలకు సైన్ చేయకుండా మూగబోయింది. కానీ, అ..ఆ... ఇంటర్వ్యూలో అంతకన్నా మంచి కథలు దొరికితే తప్పకుండా చేస్తానని సమంత ప్రకటించింది.

అది రీలీజ్ అయ్యి రెండు నెలలు గడుస్తున్నా.... ఇంతవరకు ఏ సినిమాకు ఒఫ్పుకోలేదు. పైగా ధనుష్ లాంటి స్టార్ల సినిమాను వదిలేసుకుని మరీ ఖాళీగా ఉంది. దీంతో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఆమె ఆఖరి చిత్రం అవుతుందా అని అంతా అనుకున్నారు. అయితే ఇంతలో ఏం జరిగిందో తెలీదుగానీ ఓ కొత్త సినిమాకు శామ్ సైన్ చేసేంది.

కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తీకేయన్ హీరోగా దర్శకుడు పోన్రమ్ తీయబోయే చిత్రంలో సమంతను హీరోయిన్ గా సెలక్ట్ చేశారు. ఈ చిత్రానికి ఆమె సైన్ కూడా చేసినట్లు నిర్మాణ సంస్థ 24ఏఎమ్ స్టూడియోస్ ప్రకటించింది కూడా. శివకార్తీకేయన్ ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు. అతనితో జోడీ కట్టేందుకు స్టార్ హీరోయిన్లు ఇప్పుడు క్యూ కడుతున్నారు. మాన్ కరాటే(తెలుగులో నారా రోహిత్ తుంటరి) లో హన్సిక, తాజాగా రాజామోహన్ దర్శకత్వంలో సినిమా కోసం నయనతార శివకు జోడీగా కడుతున్నారు. కొంత కాలం క్రితం  సమంతకు ఈ ఆఫర్ వచ్చినప్పటికీ అప్పుడు ఒప్పుకోలేదు. అయితే పాత్ర నచ్చటంతోనే సమంత ఇఫ్పుడు ఒప్పుకున్నట్లు అర్థమౌతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Sivakarthikeyan  ponram  

Other Articles