సింధు విక్టరీపై సినీ తారల హర్షం | Movie Stars Tweet on PV Sindhu Olympic Victory

Movie stars tweet on pv sindhu olympic victory

Celebs tweet abou PV Sindhu, Movie Stars Tweet on PV Sindhu Olympic Victory, Rajani tweet on Sindhu, Big B tweet on Sindhu, Cine celebs about Sindhu, Bollywood about PV Sindhu

Movie Stars Tweet on PV Sindhu Olympic Victory.

రియల్ స్టార్ కోసం సూపర్ స్టార్లు....

Posted: 08/20/2016 01:37 PM IST
Movie stars tweet on pv sindhu olympic victory

రజత పతకంతో కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన బ్యాడ్మింటన్ స్టార్ వీపీ సింధు విజయం దేశం మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తింది. హోరాహోరీ ఫైనల్ లో ఓటమి పాలైనప్పటికీ ఆమె అధ్భుతమైన పోరాటాన్ని అంతా ఎంజాయ్ చేశారు. ఓవైపు రాజకీయ నేతలే కాదు, మరోవైపు సినిమా సెలబ్రిటీలు కూడా ఆమె విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి... ట్విట్టర్ లో అరుదుగా ట్వీట్లు వేసే ఆయన సింధు గురించి ప్రస్తావించిన సందేశం ఆకట్టుకుంది. హట్సాఫ్ పీవీ సింధు, నేను నీకు పెద్ద అభిమానిని అయిపోయాను. కంగ్రాట్చుల్యేషన్ అంటూ ట్వీటాడు. రజనీ ట్వీట్ కు 16,000 రీట్వీట్లు పడటం విశేషం. ఇక బాలీవుడ్ బిగ్ బీ కూడా దేశాన్ని గర్వించేలా విజయాన్ని సాధించినందుకు గర్వంగా ఫీలవుతున్నామంటూ అమితాబ్ సందేశం ఉంచాడు. బాలీవుడ్ మరో అగ్రహీరో సల్మాన్ అయితే ఏకంగా పీవీ సింధుతో ఉన్న ఫోటో పెట్టడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మా అమ్మతో ఫైనల్ మ్యాచ్ చూశాం. సింధు విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందంటూ సల్మాన్ తన సందేశంలో పేర్కొన్నాడు.

వీరితోపాటు సౌత్ స్టార్ హీరో ధనుష్, మ్యాజిక్ దిగ్గజం ఏఆర్ రెహమాన్, బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, వరణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, ఫర్హాన్ అక్తర్, రితేష్ దేశ్ ముఖ్, ఆయుష్మాన్ ఖుర్రానాలతోపాటు బ్యూటీలు అలియా భట్, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, ట్వింకిల్ ఖన్నా, దియా మీర్జా, సోహైల్ అలీ ఖాన్, తదితరులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Movie Stars  Tweet  PV Sindhu  Olympic. Victory  

Other Articles