సల్మాన్ తల్లి పాత్రలో శ్రీదేవీ | Sridevi to star in Salman Khan’s next

Sridevi to star in salman khan s next

Sridevi as Salman Khan's Mother, Salman Khan Sridevi movies, Sridevi Salman Khan new movie, Sridevi Salman

Sridevi To Act As Salman Khan's Mother Role for Vipul Shah Movie.

వామ్మో! అతడికి తల్లిగానా?

Posted: 08/20/2016 10:25 AM IST
Sridevi to star in salman khan s next

హీరోయిన్ గా ఇండియా వైడ్ మొత్తం అన్ని భాషల్లో రెస్ట్ లేకుండా దుమ్ము దులిపిన శ్రీదేవీ, సెకండ్ ఇన్నింగ్స్  మాత్రం మందగించింది. ఇంగ్లీష్ వింగ్లీష్ కాస్త ఊరట కలిగించిన, విజయ్ పులి మాత్రం దారుణమైన దెబ్బ వేసింది. అందులో ఆమె వేషం, క్యారెక్టర్ చూసి జడుసుకున్న జనాలు అతిలోక సుందరికి సినిమాలు ఎంపిక చేసుకోవటం కూడా రాదా అంటూ సెటైర్లు వేశారు. దీంతో ఆచీ తూచీ సెలక్ట్ చేసుకుంటుంది.

ప్రస్తుతం భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న మామ్ చిత్రంలో నటిస్తోంది. సవతి తల్లి, కూతురుల మధ్య అన్యోన్య బంధాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. టాలెంటెడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఇంతలో ఆమె మరో క్రేజీ ప్రాజెక్టులో నటించబోతుందన్న వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. సల్మాన్ తదుపరి చిత్రంలో శ్రీదేవీ నటించబోతుందట. అది కూడా కండల వీరుడి తల్లి పాత్రలో అని సమాచారం అందుతోంది. రచయిత విపుల్ షా వినిపించిన కథ నచ్చడంతో, సల్మాన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇది తల్లీ కొడుకుల అనుబంధానికి అద్దం పట్టే కథాంశంతో రూపొందే సినిమా. ఇందులో తల్లి పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండటంతో, శ్రీదేవి అయితేనే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించారు. అన్నట్లు గతంలో చంద్రముఖి, చాంద్ కా తుక్ డా చిత్రంలో ఇద్దరు హీరోహీరోయిన్లుగా నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డా, బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రాలు బోల్తా పడ్డాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ తల్లిగా నటించేందుకు ఆమె నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో వేచి చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sridevi  Salman Khan  Vipul Shah  mother Role  

Other Articles