అమితాబ్, తాప్సీ పింక్ ట్రైలర్ విడుదల | Tapsee Pink movie theatrical trailer released

Tapsee pink movie theatrical trailer released

Tapsee pink movie, Amitabh Bachchan as lawyer, Amitabh Bachchan tapsee, Amitabh Bachchan pink, Pink tapsee, Tapsee rape, Tapsee sexual assault, Tapsee about pink director

Amitabh Bachchan, Tapsee starrer Pink movie theatrical trailer released

పింక్ ట్రైలర్: తాప్సీ వర్జిన్ కాదంట!

Posted: 08/10/2016 11:33 AM IST
Tapsee pink movie theatrical trailer released

తెలుగులో గ్లామర్ రోల్స్ మాత్రమే ఇచ్చిన దర్శకులు తన నటనకు స్కోప్ ఇవ్వకుండా తొక్కేశారని వ్యాఖ్యానించింది నటి తాప్సీ పన్ను. అయితే బాలీవుడ్ లో మాత్రం కేవలం నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలే మాత్రమే పడుతున్నాయంటూ గర్వంగా చెప్పుకుంటుంది. ఈ క్రమంలోనే బిగ్ బి అమితాబ్ తో నటించే అవకాశం కొట్టేసింది ఈ రింగు ఒత్తుల సుందరి.

బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ ప్రధాన పాత్ర లో, తాప్సీ లీడ్ రోల్ లో నటించిన పింక్ చిత్ర ట్రైలర్ విడుదలైంది. లైంగిక దాడికి గురైన అరోరా అనే యువతి పాత్రలో తాప్సీ ఇందులో నటించింది. ఈ కేసుకు సంబంధించి లాయర్ గా, ఇంకోవైపు సీక్రెట్ గా ఆమెను అనుసరించి సాయం చేసే క్యారెక్టర్ లో అమితాబ్ నటించాడు.

ట్రైలర్ ను పరిశీలిస్తే నువ్వు వర్జిన్ వా అని అమితాబ్ అడిగితే.. అంటే కాదు అని సమాధానం చెప్పటంతో మొదలౌతుంది. అరోరా అనే యువతి తన ఇద్దరు స్నేహితురాళ్లతో జీవిస్తూ ఉంటుంది. డబ్బు కోసం యువకులతో ఎంతదాకా అయినా వెళ్లే వారిలో లైఫ్ లో ఓ రాత్రి అనుకోని ఘటన జరుగుతుంది. అరోరాను ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడతాడు. ఆ క్రమంలో అతని తలను బాటిల్ తో పగలగొడుతుంది అరోరా. ఆ వ్యక్తి పై కేసు పెడితే అతనూ తిరిగి హత్యాయత్నం కింద కేసు పెట్టే అవకాశం ఉంటుందని, కాబట్టి దానిని మరిచిపోమ్మని చెబుతారు. అయినా వినకుండా ఫిర్యాదు చేయటంతో తాప్సీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. అక్కడ లాయర్ గా అమితాబ్ కాస్త వల్గర్ గానే ఆమెను ప్రశ్నలు అడుగుతాడు. అదే సమయంలో వారికి రహాస్యంగా వెంబడిస్తూ సాయం చేయాలనుకుంటాడు. చివరకు తాప్సీకి న్యాయం దొరుకుతుందా? అన్నదే కథగా తెలుస్తోంది. బోల్డ్ కంటెంట్ కాస్త ఎక్కువగానే ఉన్న ఈ సినిమాకు సెన్సార్ చిక్కులు తప్పవనే అనుకోవచ్చు.       

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amitabh bachchan  Pink  Tapsee  trailer  

Other Articles