ముఖాముఖి ఇంటర్వ్యూలో హీరో సునీల్ గరం | Sunil Fire on TV9 jounalist

Top channel sunil interview meaning less

Hero Sunil fire, Sunil TV9 interview, Sunil fire on TV9 anchor, Sunil TV9 interview

Hero Sunil fire on TV9 anchor in face to face interview.

సునీల్ ను అంతలా అవమానించాలా?

Posted: 08/10/2016 12:32 PM IST
Top channel sunil interview meaning less

మధ్యలో వచ్చిన ఒకటి రెండు ఫ్లాప్ లను పట్టుకుని సునీల్ ను ఐరెన్ లెగ్ గా అభివర్ణించాయి కొన్ని మీడియా చానెళ్లు. కానీ, మాగ్జిమమ్ హిట్లే అన్న సంగతిని మాత్రం ఎక్కడా ప్రస్తావించడం లేదు. సునీల్ ఏ కథ పట్టుకున్న మసై పోతుంది అంటూ ఒకనోక టైంలో ఊదరగొట్టేశాయి. చివరికి తనకు అచ్చోచ్చిన కామెడీ సబ్జెక్టు అంటూ జక్కన్నతో వచ్చాడు. అది కాస్త జనాలకు నచ్చటంతో సక్సెస్ మీట్లు, చానెళ్లలో స్పెషల్ ప్రోగ్రాంలతో హడావుడి చేస్తున్నాడు సునీల్. ఈ క్రమంలో ఓ టీవీ చానెల్ చేసిన ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగిన అర్థం పర్థం లేని ప్రశ్నలకు కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు.

ఓ ప్రముఖ చానెల్ నిర్వహించిన ఫేస్ టూ ఫేస్ లో సునీల్ ను సదరు యాంకర్  కొన్ని ప్రశ్నలు అడిగాడు అందులో పవన్ జనసేన లో చేరి, పనిచేయటం లాంటి పాజిటివ్ విషయం ఒక్కటి తప్పించి మొత్తం ఇంటర్వ్యూ అంతా పనికి మాలిన ప్రశ్నలతోనే సాగింది. కామెడీ, సిక్స్ ప్యాక్, పూలరంగడు, లవ్ ప్రపోజ్ లంటూ సాగిన ఈ ఇంటర్వ్యూలో అర్థవంతమైన ప్రశ్నలు కొరవడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఓ ప్రశ్నతో మాత్రం సునీల్ కి కోపం నశాలానికి అంటింది.

'మీకు హీరో ఫీచర్లు ఉన్నాయని ఫీలవుతున్నారా..? అసలు అద్దంలో మొహం చూసుకున్నప్పుడు, హీరోగా మీరు ఫిట్ అని ఎప్పుడైనా అనిపించిందా..? సునీల్ వర్మ కాకపోయుంటే అసలు ఇండస్ట్రీలో నెగ్గుకొచ్చేవారా?' అంటూ సదరు జర్నలిస్ట్ ప్రశ్నలు గుప్పించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సునీల్... ఏం తక్కువుంది నాలో? చంపేస్తాను అంటూ కాస్త సీరియస్ గానే స్పందించాడు. నిజానికి సునీల్ కెరీర్ లో చాలా కష్టపడి పైకోచ్చాడు. కామెడీ టైమింగే కాదు, ఫిట్ నెస్ విషయంలో టాప్ హీరోలు కూడా చేయలేని శ్రమను చేశాడు. అలాంటిది సునీల్ ను ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయటంపై చాలా మంది మండిపడుతున్నారు.

ప్రముఖ ఛానెల్ అయి ఉండి టీఆర్పీ కోసం ఇలాంటి చెత్త ప్రశ్నలతో సునీల్ లాంటి వాళ్లపై కామెంట్లు చేయటం ఏంటని పలువురు మండిపడుతున్నారు. ఇకనైనా ఇలాంటి వాటిని ఆపేస్తే మంచిదని వారు సూచిస్తున్నారు.  అంతకుముందు నటి, ఎమ్మెల్యే రోజా విషయంలోను, టీడీపీ నేత ఆనం వివేకానంద విషయంలోను ఇలాగే వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రశ్నలు అడిగి విమర్శల పాలయ్యాడు సదరు యాంకర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Hero  Sunil  face to face  interview  fire  journalist  

Other Articles