కబాలి కలెక్షన్లు బాహుబలిని దాటేశాయి | kabali surpassed Baahubali collections

Kabali surpassed baahubali collections

kabali surpassed Baahubali collections, Kabali 650 crores collections, Kabali collections, Kabali Beat Baahubali

kabali surpassed Baahubali collections, earned 650 crores.

అఫీషియల్ : బాహుబలిని బీట్ చేసింది

Posted: 08/10/2016 11:19 AM IST
Kabali surpassed baahubali collections

విడుదలకు ముందు ఎంతటి అంచనాలతో వచ్చిందో, డివైడ్ టాక్ అయినప్పటికీ సంచలనాలను కంటిన్యూ చేస్తోంది 'కబాలి'. రజనీ నేమ్ ఫేమ్ వాడుకుని తొలిరోజున ఓపెనింగ్స్ తోనే ఈ సినిమా కొత్త రికార్డులకు తెరలేపింది. ఓపెనింగ్ కలెక్షన్ రికార్డుతోపాటు, అత్యంత వేగంగా 100 కోట్లను, 200 కోట్ల క్లబ్ లో చేరిన సౌత్ సినిమాగా రికార్డు సాధించింది. ఇక ఇప్పుడు కలెక్షన్ల పరంగా మరో ఫీట్ ను సాధించింది కబాలి.

మలేసియాలో 20 కోట్లకి పైగా వసూలు చేసి, అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. అంతేకాదు యుఎస్ ఏ లో చాలా వేగంగా 1 మిలియన్ డాలర్ మార్క్ ను అందుకున్న సౌత్ ఇండియన్ సినిమాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. రజనీకి గల క్రేజ్ కి ఈ సినిమా వసూళ్లే కొలమానం అంటూ, అంతా గొప్పగా చెప్పుకుంటున్నారు.

తలైవా దెబ్బకి 600 కోట్ల క్లబ్ లో ఇదివరకే చేరిపోయిన ఈ చిత్రం తాజాగా బాహుబలి రికార్డును క్రాస్ చేసినట్లు సమాచారం. ఓవరాల్ గా 650 కోట్లు దాటిన కబాలి, ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్ కలెక్షన్లలో మూడో స్థానంలో నిలిచిందని నిర్మాత కలైపులి థాను ప్రకటించాడు. అమీర్ ఖాన్ పీకే, సల్మాన్ భజిరంగీ బాయిజాన్ లు మొదటి రెండు స్థానాల్లో ఉన్న సంగతి తెలిసిందే. సౌత్ తరపున సమీప భవిష్యత్తులో బాహుబలిని నెట్టేసి కబాలి నెలకొల్పిన రికార్డును బీట్ చేసే సత్తా ఒక్క బాహుబలి 2 కి మాత్రమే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kabali  Baahubali  Collections  650 crores  

Other Articles