రాజుగారి గది కాదు కానీ, ఓంకార్ తో సినిమా ఉంది | senior hero venkatesh about movie with Ohmkar

Senior hero venkatesh about movie with ohmkar

venky-omkar movie, rajugari gadhi sequel, venky not in Rajugari gadhi sequel, Venky confirmed movie with Omkar, venkatesh omkar, venky babu bangaram interview

Venkatesh about movie with Ohmkar, says it is not rajugari gadhi sequel.

ఓంకార్ తో సినిమా ఉంది, కానీ...

Posted: 08/09/2016 12:57 PM IST
Senior hero venkatesh about movie with ohmkar

రాజుగారి గది హర్రర్ కంటెంట్ తో చిన్న చిత్రంగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. యాంకర్ కమ్ దర్శకుడు ఓంకార్ డైరక్షన్ లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉండబోతుందని, దాంట్లో విక్టరీ వెంకటేష్ నటించబోతున్నాడని వార్తలు వినవచ్చాయి. అయితే ఓంకార్ తో సంప్రదింపులు జరిగిన మాట వాస్తవమే గానీ, అది రాజుగారి గది సీక్వెల్ కాదంటున్నాడు వెంకీ.

ప్రస్తుతం బాబు బంగారం ప్రమోషన్స్ లో తెగ బిజీగా ఉన్న వెంకీ తన రాబోయే చిత్రాల గురించి చెప్పుకోచ్చాడు. ఈ క్రమంలోనే ఓంకార్ సినిమా గురించి ఓపెన్ అయ్యాడు. ఓంకార్ తో కథా చర్చలు జరుగుతోన్న మాట వాస్తవమేనని, అయితే అది 'రాజుగారి గది'కి సీక్వెల్ కాదనీ, ఆ తరహాలో కొనసాగే కొత్త కథ అని చెప్పాడు. దీంతో ఓంకార్ అన్నయ్యతో సినిమా ఉంటుందన్న వార్తను కన్ఫర్మ్ చేసినట్లు అయ్యింది. ప్రస్తుతానికైతే సాలా ఖడ్డూస్ రీమేక్ తన తర్వాతి ప్రాజెక్టు, రానాతో సినిమా గురించి కథ చర్చలు జరుగుతున్నాయని చెప్పుకోచ్చిన వెంకీ నేను శైలజ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోయే చిత్రానికి ఆడవాళ్లు మీకు జోహార్లు అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు చెప్పిన సంగతి విదితమే.

ముఫ్పై ఏళ్ల తన కెరీర్ లో చాలా అలసిపోయానని, ఇక రిటైర్మెంట్ అవుకుందామనుకున్న సమయంలో బాబు బంగారంతో మారుతి తనలో కొత్త శక్తిని నింపాడని చెప్పాడు. ఇన్నాళ్లూ మంచి కథలు దొరక్క ఆగిపోవాల్సి వచ్చిందన్న వెంకీ, బాబు బంగారంతో మొదలౌతున్న ఈ జర్నీ ఇక నాన్ స్టాప్ గా కొనసాగుతుందంటూ బ్యాక్ టూ బ్యాక్ నాలుగు చిత్రాలు గురించి క్లారిటీ ఇచ్చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkatesh  babu bangaram  interview  omkar movie  rajugari gadhi sequel  

Other Articles