పవన్ కళ్యాణ్ కడప కింగ్ కథ అది కాదంట | Pawan kalyan Kadapa King story just a rumour

Pawan kalyan dolly kadapa king movie story just a rumour

Pawan Dolly movie, Kadapa king rumour, Pawan story leaked, kadapa King story, Kadapa king Fake story, Pawan kadapa king latest update

Pawan kalyan Kadapa King story just a rumour.

పవన్ కడప కింగ్ కథ అది కాదంట...

Posted: 08/09/2016 01:55 PM IST
Pawan kalyan dolly kadapa king movie story just a rumour

ఒకప్పుడు సినిమా షూటింగ్ లలో అయిన లీక్ ల పర్వం అసలు మొదలు కాకుండానే బయటికొచ్చే స్థాయికి ఎదిగిపోయింది. తాజాగా ఆ ప్రభావం పవన్ కళ్యాణ్ డాలీ సినిమాపై కూడా పడింది. ఇంకా పట్టాలెక్కని ఈ సినిమా గురించి ఈ లోపే కొందరు ఏవేవో రాసి పడేస్తున్నారు.

ఈ చిత్రానికి కడప కింగ్ అనే టైటిల్ అనుకున్నారని చాలా రోజుల క్రితం వార్తలు రాగా, అందులో నిజం లేదంటూ స్వయానా నిర్మాత శరత్ మరార్ ప్రకటించాడు. ఇక ఇప్పుడు ఏకంగా కథే ఇదంటూ పెట్టిపడేశాయి కొన్ని ప్రముఖ సైట్లు. దాని ప్రకారం... కడపలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్ అయిన పవన్ కి ఫ్లాష్ బ్యాక్ లో ఓ లవ్ స్టోరీ ఉంటుందట. అయితే పెద్దల గొడవల ప్రభావమో, పరిస్థితుల ప్రభావమో తెలీదు గానీ వారిద్దరు ఒకటి మాత్రం కాలేకపోతారంట. దీంతో లవ్ ఫెయిల్యూర్ అయిన పవన్ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోదామనుకుంటాడంట. ఆ ఫ్యాక్షన్ ఊబిలోనే జీవితం కొనసాగిస్తుండగా, ఓ రోజు మరో అమ్మాయిని(శృతీహాసన్) ను చూసి ప్రేమలో పడటం, ఈ ముదురు ఏజ్ కింగ్ కి అమ్మాయి ఫ్లాటయి పోవటం, ఓవైపు జనాల కోసం పోరాడుతూనే, తన ప్రేమను దక్కించుకోవటం ఇలా కథ ఉంటుందని రాసేశారు.

గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో చాలా సినిమాలే వచ్చాయి. అలాంటిది ఇలాంటి ఓల్డ్ సబ్జెక్ట్ మూవీని పవన్ అస్సలు ఎంచుకోడని పవన్ అభిమానులు చెబుతున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన సినిమా కథను దర్శకుడు డాలీయే ఇంకా బయటికి తీయనే లేదు. ఒకవేళ ఆ కథే నిజమయితే ఇంకో హీరోయిన్ గురించి లీకులు రావాలి. సో... అలాంటివేం జరగలేదు కాబట్టి కథ ఉత్తదేనంటున్నారు. మరి అలాంటిది ఈ పుకార్లను ఎవరు సృష్టిస్తున్నారో? వాటిని ఎందుకు ఇంతగా వైరల్ చేస్తున్నారో తెలీదు. ఈ విషయంలో నిర్మాత మరార్ ఏమైనా స్పందిస్తాడో చూడాలి. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కానుంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, శృతీహాసన్ హీరోయిన్ గా నటించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Kadapa King  Fake story  Shruthi hassan  

Other Articles