కృష్ణా పుష్కరాలకు సంపూర్ణేష్ బాబుకు ఆహ్వానం | sampoornesh special thanks to AP govt for Krishna Pushkarala invitation

Sampoornesh special thanks, Sampoo special thanks to AP govt, Sampoo on Krishna Pushkaralu, Sampoo AP govt, Special invitation to Burning star, Burning star twitter

Sampoornesh special thanks to AP govt for Krishna Pushkarala invitation.

సంపూబాబుకి ఇది స్పెషల్ ఇన్విటేషన్

Posted: 08/09/2016 12:29 PM IST

కొత్తగా ఎందరు స్టార్ లు వచ్చినా బర్నింగ్ స్టార్ పాపులారిటీకి ఎవరూ సరితూగలేకపోతున్నారు. హృదయకాలేయంతో ఈ అందగాడు సృష్టించిన రికార్డులు అలాంటివి. రాజమౌళి ట్వీట్ తో మొదలైన అతని గుర్తింపు దేవ విదేశాలు దాటి పోయిందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే ఈ సెటైరిక్ బాబూ ప్రస్తుతం వేసిన ఓ ట్వీట్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

మరో నాలుగు రోజుల్లో పవిత్ర కృష్ణా నదికి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. నవ్యాంధ్రలో నిర్వహించబోతున్న తొలి పుష్కరాలు కావటంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో వీఐపీలకు సెలబ్రిటీలకు ఆహ్వానాలు పంపుతోంది ఏపీ ప్రభుత్వం. ఆ జాబితాలో మన బర్నింగ్ స్టార్ కూడా ఉన్నాడు. ఇంకేం ఊరుకుంటాడా?  

ఈ నెల 12 నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాలు రావాల్సిందిగా ఓ ఆహ్వన పత్రిక మనోడికి పంపింది. అంతే ఫోటోను షేర్ చేస్తూ ట్విట్టర్ లో ఈ విషయాన్ని తెలియజేశాడు. ఈ వేడుకలకు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వానికి తన నమస్సులు అంటూ ఆ ట్వీట్ తో మరోసారి ఆకట్టుకున్నాడు. కాగా, ప్రస్తుతం సంపూ 'కొబ్బరిమట్ట'తో తెగ బిజీగా ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sampoornesh Babu  AP govt  Krishna Pushkaralu  Invitation  

Other Articles