Vijay Devarakonda in Demand

Vijay devarakonda in pawan kalyan film

Vijay Devarakonda in pawan kalyan, Vijay Devarakonda in demand, Vijay Devarakonda Yevade Subramanyam, Vijay Devarakonda, Pawan kalyan, Dolly Movie, Pelli Choopulu Hero, Telugu News, Tollywood News

Vijay Deverakonda who played hero Nani's best friend in Yevade Subramanyam that was produced by Ashwini Dutt's daughter is on a roll.

పవన్ స్టార్ చిత్రంలో దేవరకోండ విజయ్..?

Posted: 08/07/2016 12:53 PM IST
Vijay devarakonda in pawan kalyan film

'పెళ్లిచూపులు' సినిమాతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిన యువ హీరో విజయ్ దేవరకొండకి వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. సహజమైన నటనతో మెప్పించిన ఈ కుర్రాడికి మంచి భవిష్యత్ ఉందని అంటున్నారు. ఇప్పటికే 'అర్జున్ రెడ్డి' అనే టైటిల్తో వస్తున్న సినిమాలో హీరోగా నటిస్తుండగా ఆ తర్వాత లైన్లో 'ద్వారక' పేరుతో మరో సినిమా ఉంది. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన 'వైజయంతీ మూవీస్' బ్యానర్లో మరో సినిమాకు విజయ్ సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.

కాగా తాజాగా ఈ యువ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో కూడా నటిస్తున్నట్లు చిత్రపురిలో వార్తలు షికార్లు కోడుతున్నాయి. ఇటీవలే ఓ హిట్ కొట్టి ఊపుమీదున్న ఆ హీరోకు ఇప్పటికే అవకాశాలు వెల్లువలా వస్తుండగా, పవన్ పిలిచి మరీ అవకాశం ఇవ్వడం నిజంగా అద్భుతం. డాలీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న తాజా చిత్రంలో విజయ్ ఒక కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై కొద్ది రోజుల క్రితమే పవన్ విజయ్‌తో మాట్లాడినట్టు సమాచారం.

ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించనుంది. పవన్ సినిమాలో విజయ్ నటించడం నిజమే అయితే... అది అతడి కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం సందీప్ వంగా అనే కొత్త దర్శకుడితో విజయ్ ఒక సినిమా చేస్తున్నాడు. సూపర్ గుడ్ బ్యానర్‌పై 'ద్వారకా' అనే చిత్రంలోనూ విజయ్ నటిస్తున్నాడు. అశ్వనీదత్, దిల్‌రాజ్ లాంటి ప్రముఖ నిర్మాతల సినిమాల్లోనూ విజయ్‌కు నటించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Devarakonda  Pawan kalyan  Dolly Movie  Pelli Choopulu Hero  Telugu News  Tollywood News  

Other Articles