హరీష్ శంకర్ సినిమా కోసం 8 ప్యాక్ | bunny eight pack for Harish Shankar Movie

Bunny eight pack for harish shankar movie

Allu Arjun 8 pack, Bunny eight pack, Allu Arjun Harish Shankar movie, Allu Arjun Harish Shankar movie actress

Allu Arjun 8 pack for Harish Shankar Movie.

స్టైలిష్ స్టార్ షాకింగ్ అవతారం

Posted: 08/08/2016 01:12 PM IST
Bunny eight pack for harish shankar movie

యూత్ లో స్టైల్ ఐకాన్ గా నాటుకుపోయి క్లాస్ మాస్ అన్న భేదం లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అభిమాన హీరో అయిపోయాడు అల్లు అర్జున్. ఒకప్పుడు మూస ధోరణితో వెళ్తున్న తెలుగు సినిమాకు డాన్సులు, ఫైట్లను స్టైల్ గా మార్చేసి చిరు కొత్త బాట వేస్తే,  ఇప్పుడు బన్నీ మెగా రూట్ లోనే వెళ్తూ అభిమానులను పెంచుకుంటూ పోతున్నాడు.

టాలీవుడ్ కు సిక్స్ ప్యాక్ ట్రెండ్ ను అలవాటు చేసి యంగ్ జనరేషన్ తోపాటు, సీనియర్లలో కూడా కొందరు కూడా తనను ఫాలో అయ్యేలా చేశాడు.  'దేశముదురు'లో సిక్స్ ప్యాక్ చూపించిన అల్లు అర్జున్, ఈ సినిమాలో 8 ప్యాక్ తో మెప్పించనున్నాడని చెబుతున్నారు. ఫిట్ నెస్ పై స్పెషల్ కేర్ తీసుకునే బన్నీ సరైనోడు కోసం ఎంతగా మారిపోయాడో తెలిసిందే. సినిమా సినిమాకి లుక్ మార్చేసే ఈ అల్లువారి అబ్బాయి తన తర్వాతి చిత్రం కోసం కూడా మరో ఫీట్ ను చేసేందుకు సిద్ధమైపోతున్నాడంట.

హరీష్ శంకర్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ కొత్త లుక్ తో కనిపించనున్నాడని చెబుతున్నారు. అంతేకాదు .. ఈ సినిమాలో ఆయన 8 ప్యాక్ తో ఆశ్చర్యచకితులను చేయనున్నాడని అంటున్నారు. అందుకోసం ఆయన ఒక రేంజ్ లో కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం హరీష్ స్క్రిప్ట్ వర్కును పూర్తిచేసే పనిలో వున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కేథరిన్ థెస్రానే మరోసారి హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Stylish Star  Allu Arjun  eight pack  new look  Harish Shankar  movie  

Other Articles