నీరజ కోన పాట రాసింది | Neeraja Kona write lyrics for vellipoke song in Thikka

Neeraja kona write lyrics for vellipoke song in thikka

Neeraja Kona lyricist, Vellipoke song in Thikka, Thikkasong, Samantha friend Neeraja Kona thikka, popular designer turns lyricist

Neeraja Kona write lyrics for vellipoke song in Thikka.

సమంత ఫ్రెండ్ పాట రాసిందండోయ్

Posted: 08/01/2016 10:10 AM IST
Neeraja kona write lyrics for vellipoke song in thikka

తన సినిమాలోని హీరోలను సింగర్ లు మార్చి పాటలు పాడించడంలో సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ ఎప్పుడూ ముందుంటాడు. ఎంతలా అంటే మహేష్ బాబుతో బిజినెస్ మ్యాన్ లో మైక్ ముందు నిలబెట్టేంతలా... ఒక్కొసారి ఒక భాషకు చెందిన హీరోలను వేరే భాషల్లో కూడా పాడించిన దాఖలాలు అనేకం ఉన్నాయి. ఆ జాబితాలో హీరోయిన్లు కూడా చాలా మందే ఉన్నారు.

కానీ, ఇప్పుడు మనోడి ఎంకరేజ్ మెంట్ తో ఓ సెలబ్రిటీ ఏకంగా పాటల రచయితగా మారిపోవటం విశేషం. సాయిధరమ్ తేజ్ 'తిక్క' చిత్రానికి థమన్ సంగీతం అందించగా, పాటలు రెండు రోజుల క్రితం విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ఓ పాటను ఓ కాస్టూమ్ డిజైనర్ చేత రాయించాడు. ఆమె ఎవరో కాదు నటి సమంత బెస్ట్ ఫ్రెండ్ నీరజ కోన. ఒక్క సమంతకే కాదు రకుల్, త్రిష, నయనతార లాంటి స్టార్ హీరోయిన్లకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని చిత్రాలకు స్టైలిష్ డిజైనర్ గా వర్క్ చేసింది. ఆయా సెలబ్రిటీలతో స్నేహం కొనసాగిస్తూ, టైమ్ స్పెండ్ చేస్తూ, ఫోటోలు దిగుతూ తరచూ షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక తిక్క సినిమాలో ‘వెళ్లిపోకే’ అనే పాట రాసింది నీరజే. నిజానికి థమన్ ఈ విషయం చెప్పినప్పుడు ముందు ఆశ్చర్యపోయినప్పటికీ, తర్వాత అతనిపై నమ్మకంతో దర్శకుడు సునీల్ ఒప్పేసుకున్నాడంట. అయితే తనకు ఏ మాత్రం ఆసక్తి లేకున్నా పట్టుబట్టి ఈ పాట రాయించాడని చెబుతోంది నీరజ. చిన్నతనంలో సొంతంగా పోయమ్స్ రాయటం బాగా అలవాటు ఉండేదని, అది ఇప్పుడు ఇలా పనికొచ్చిందని ఆమె అంటోంది. అన్నట్లు తిక్క కోసం తమిళ స్టార్ హీరోలు ధనుష్ - శింబులు చెరో పాట పాడటం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Thikka  saidharam tej  Thaman  Neeraja Kona  lyrics  Vellipoke song  

Other Articles