శ్రీరస్తు శుభమస్తు ఈవెంట్ లో చిరు ఏం చెప్పాడంటే... | chiranjeevi attend to Srirastu Subhamastu Pre Release Function

Chiranjeevi attend to srirastu subhamastu pre release function

chiranjeevi at Srirastu Subhamastu Pre Release Function, chiru about sirish at SRSM event, Allu Sirish about Mega Star, chiru satire on Sai Dharamtej, lavanya about chiru

chiranjeevi attend to Srirastu Subhamastu Pre Release Function

అల్లు వారబ్బాయికి మెగా ఆశీస్సులు

Posted: 08/01/2016 08:44 AM IST
Chiranjeevi attend to srirastu subhamastu pre release function

తన నట వారసుల చిత్ర పంక్షన్లకు హాజరై ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటాడు. ఈ క్రమంలోనే అల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు ప్రీ ఈవెంట్ కు హాజరైన చిరు శిరీష్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కెరీర్ మొదట్లో శిరీష్ నిర్మాతగా మారతాడని భావించానని, కానీ, తాను మాత్రం ఇప్పుడు హీరో అయ్యాడని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఎప్పుడూ లెక్కలు మాట్లాడే శిరీష్ ఒకరోజు వచ్చి, 'మావయ్యా, ఆర్టిస్టు అవుతా'నని అన్నాడని, 'మన ఫ్యామిలీ అభిమానులు ఆదిరిస్తారు, నటించు' అని వెన్నుతట్టానని చెప్పుకొచ్చాడు.

గత రెండు సినిమాల్లో శిరీష్ కు నటనపై పట్టుకావాలనిపించిందని, ఈ సినిమాతో ఆ అనుమానాలు పోగొట్టాడని చిరు తెలిపాడు. మిగిలిన వారిలా హడావుడిగా సినిమాల్లో నటించకుండా శిరీష్ నిదానంగా నటిస్తూ, అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం విశేషమని, అది మంచి పద్ధతని ఆయన అభినందించాడు. 'శ్రీరస్తు శుభమస్తు' పేరుతో గతంలో సరితతో తాను 80ల్లో నటించిన సినిమాను గుర్తుచేసుకున్న ఆయన ఆ చిత్రంలాగే ఇది ఘన విజయం సాధించాలని కోరుకున్నాడు. ఈ సినిమా రషెస్ చూశానని, అద్భుతంగా ఉందని, ముఖ్యంగా శిరీష్, లావణ్యలు బాగా చేశారని చెప్పాడు.

దర్శకుడు పరుశ్ రాం ఓసారి కలిసినప్పుడు చిత్ర కథ చెప్పుకొచ్చాడు. కథ ఎలా చెప్పాడో అలాగే తీశాడు. ప్రేమ పెళ్లిళ్లకు అభ్యంతరాలు చెప్పే తండ్రి, కుమారుడికి మధ్య జరిగే 'ఇగో క్లాషే' ఈ సినిమా. ఈ సినిమా చూడగానే తనకు 'బొమ్మరిల్లు' గుర్తుకువచ్చిందని ఆయన తెలిపారు. శిరీష్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడని ఆయన అభినందించారు.

ఇక మామయ్య తన ఫంక్షన్ కు తొలిసారి వచ్చి ఆశీస్సులు అందజేయటం పట్ల అల్లు శిరీష్ చాలా ఎక్సయిట్ అయి ప్రసంగించాడు. తనను ఎలా ప్రొత్సహించింది తదితర విషయాలను శిరీష్ చాలానే చెప్పుకొచ్చాడు. చిరంజీవి గారు ఇలా తమ ఫ్యామిలీలోని అందరి హీరోలనూ ప్రోత్సహించడం అనేది చాలా పెద్ద విషయం.. దానికి కృతజ్ఞులం.. అంటూ ముగించాడు శిరీష్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megastar  Chiranjeevi  Srirastu Subhamastu  Pre Release Function  allu sirish  

Other Articles