హంటర్ రీమేక్ లో యాంకర్ శ్రీముఖి | Anchor Srimukhi in Hunterrr remake

Anchor srimukhi in hunterrr remake

Anchor Srimukhi in Hunterrr remake, srimukhi in adult movie, srimukhi in adult remake, srimukhi avasarala srinivas, anchor for avasarala srinivas, Srimukhi heroine, srimukhi got one more opportunity, regina and srimukhi romance with avasarala, srimukhi romance with avasarala

Telugu anchor srimukhi in Hunterrr remake.

అడల్ట్ రీమేక్ లో తెలుగు యాంకర్

Posted: 08/01/2016 12:07 PM IST
Anchor srimukhi in hunterrr remake

అడల్ట్ సినిమాల పట్ల మక్కువ రాను రాను ఎక్కువైపోతుంది. బాలీవుడ్ లో అతిగా వస్తున్న ఈ సంప్రాదాయానికి ఈ యేడాది మాత్రం పెద్ద దెబ్బే పడింది. వచ్చిన సినిమాలు వచ్చినట్లే బోల్లాపడుతున్నాయి. అయితే గతేడాది గుల్షన్ దేవయ్య హీరోగా వచ్చి బాలీవుడ్ లో బిగ్ హిట్ గా నిలిచిన అడల్ట్ చిత్రం హంటర్ ను తెలుగులో తెరకెక్కించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.

అవసరాల శ్రీనివాస్ హీరోగా ఈ సినిమాను తీయబోతున్నారు. సెక్స్ అడిక్టెడ్ యువకుడి పాత్రలో అవసరాల కనిపించబోతున్నాడు. కథ ప్రకారం ముగ్గురు హీరోయిన్లు అవసరం కాగా, ఇప్పటికే డస్కీ బ్యూటీ రెజీనాను ఒక పాత్రకి తీసేసుకున్నారు. ఇక మరో పాత్ర కోసం టాలీవుడ్ యాంకర్ కమ్ నటి శ్రీముఖిని తీసుకున్నట్లు తెలుస్తోంది.

టీవీషోలలో యాంకరింగ్ తో కెరీర్ ను ప్రారంభించిన శ్రీముఖి ఈ మథ్య తెలుగు సినిమాల్లో బాగానే మెరుస్తోంది. నేను శైలజ, జెంటిల్మెన్ చిత్రాల్లో ఆమె పాత్రకి మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఆమెను ఈ చిత్రం కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది.

హిందీలో రాధికా ఆప్టే చేసిన పాత్రకి రెజీనాను ఎంపిక చేశారు. కాలేజ్ ఏజ్ లో హీరో గాళ్ ఫ్రెండ్ పాత్రకిగాను 'శ్రీముఖి'ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక మిగిలింది మూడవ కథానాయిక ఎంపికే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Srimukhi  Hunterrr remake  avasarala srinivas  regina  

Other Articles