బెల్లంకొండ చిత్రానికి పుష్పక విమానం టైటిల్ | rakul preet singh in Boyapati's Pushpaka Vimanam

Rakul preet singh in boyapati s pushpaka vimanam

boyapati title, boyapati-bellamkonda srinivas Pushpaka Vimanam, Rakul in Pushpaka Vimanam, Rakul bellamkonda Srinivas

Pushpaka Vimanam title finalised for Bellam Konda srinu and boyapati movie. Rakul Preet Singh paired with bellamkonda Srinivas.

పుష్పక విమానం కోసం రకుల్ ను అడిగారంట

Posted: 07/23/2016 11:44 AM IST
Rakul preet singh in boyapati s pushpaka vimanam

కమల్ హాసన్ హీరోగా లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ తెరకెక్కించిన మూవీ వండర్ పుష్పక విమానం. పూర్తిస్థాయి మూకీ చిత్రంగా తెరకెక్కిన చిత్రం అప్పట్లో జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే టైటిల్ తో టాలీవుడ్ లో ఓ చిత్రం రాబోతుందని తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ఓ చిత్రం తీయబోతున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అల్లుడు బంగారం అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే ఇంతలో టైటిల్ మార్చేస్తున్నారనే సమాచారం అందుతోంది.

తొలుత హీరోయిన్ గా తమన్నాను కథానాయికగా అనుకున్నప్పటికీ డేట్స్ అందుబాటులో లేకపోవటంతో కొత్త హీరోయిన్ కోసం వేట కొనసాగించారు. ఇంతలో అగ్రహీరోయిన్ గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ నే తీసేసుకున్నారు. మహేష్ సినిమా ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా ఇంకోవైపు బోయపాటి సినిమాను ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెల్లంకొండ శీనుతో నటించేందుకు గతంలో సమంత లాగే రకుల్ కూడా భారీ పారితోషికాన్ని అందుకుందని వినికిడి.

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ దశలో ఉన్న ఈ  సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.  అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకి ఇప్పుడు 'పుష్పక విమానం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపు ఈ టైటిల్ ఖరారు కావొచ్చని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bellamkonda Srinivas  Rakul Preet Singh  Boyapati  Pushpaka Vimanam  

Other Articles