ట్రైలర్ : ప్రతీ ఒక్కరి కథ... మనమంతా | Mohanlal Manamantha Theatrical Trailer out

Mohanlal manamantha theatrical trailer out

mohanlal manamantha, mohanlal telugu debut movie, manamantha trailer, mohanlal goutami movie

Mohanlal Manamantha Movie Theatrical Trailer out.

ట్రైలర్ : ప్రతీ ఒక్కరి కథ... మనమంతా

Posted: 07/23/2016 03:07 PM IST
Mohanlal manamantha theatrical trailer out

ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, సాహసం వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు ఏర్పరుచుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి.  చిత్ర చిత్రానికి ప్రత్యేకమైన జోనర్లను కథాంశాలను తెరకెక్కించిన  సినిమాలకు జాతీయస్థాయిలో కూడా గుర్తింపు లభించాయి. అందుకే మోహన్ లాల్ లాంటి స్టార్ దర్శకుడు ఆయన డైరక్షన్ లో నటించాడు. అదే మనమంతా...

ఈసారి కూడా తన పంథాకి కాస్త విభిన్నమైన కథాంశంతోనే 'మనమంతా' సినిమాను తెరకెక్కించాడని ఆ మద్య టీజర్ తో స్పష్టమయ్యింది. మోహన్ లాల్ .. గౌతమి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మధ్యతరగతి జీవితాలు .. ఆనందాలు .. అనుభూతులు .. సంతోషాలు .. సమస్యలను ఆవిష్కరించే దృశ్యాలతో ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

నాలుగు జీవితాలు ఆనందంగా ఉన్న సమయంలో అనుకోకుండా కొన్ని సమస్యలు వస్తాయి. అలాగని ఈ నాలుగు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండానే సాగుతాయా అన్నదే అసలు కథ. మనచుట్టూ జరిగే సంఘటనలను చూస్తున్నట్టు అనిపించేంత ఫీల్ తో ఈ సినిమా తెరకెక్కిందనే విషయం, ఈ ట్రైలర్ చూస్తే అర్ధమైపోతుంది. తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో ఆగస్టు 5న ఈ సినిమా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manamantha  Mohanlal  Chandra Shekar yeleti  Goutami  

Other Articles