హీరోయిన్ కాపురంలో చిచ్చు ఎలా పడింది? | Amala Paul And Vijay marriage life in trouble

Amala paul and vijay marriage life in trouble

Amala Paul And Vijay marriage, Amala Paul And AL Vijay divorce, amala paul divorce

Amala Paul And Vijay marriage life in trouble.

హీరోయిన్ కాపురంలో చిచ్చు ఎలా పడింది?

Posted: 07/23/2016 11:03 AM IST
Amala paul and vijay marriage life in trouble

సెలబ్రిటీల పర్సనల్ వ్యవహారం చిన్న గ్యాప్ దొరికితే చాలూ మీడియాకి ఎక్కేస్తుంది. ముఖ్యంగా రంగు ప్రపంచంలోని వాళ్లదయితే చాలా ప్రత్యేకం.  ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ స్టార్ జంట ప్రస్తుతం విడాకులకు సిద్ధమైందన్న వార్త కోలీవుడ్ లో కలకలం రేపుతోంది. ఇంతకీ ఆ జంట ఎవరో కాదు నటి అమలాపాల్-దర్శకుడు విజయ్. అవును ... డస్కీ బ్యూటీ అమలాపాల్ వైవాహిక జీవితంలో కలతలు వచ్చినట్టుగా గత కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

కోలీవుడ్ తోపాటు టాలీవుడ్, ఇంకోవైపు కన్నడ, మళయాళంలో కూడా నటిస్తోంది అమలా. కెరీర్ బాగా నడుస్తున్న సమయంలోనే  క్రితం తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ను ప్రేమించి రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. భర్త అనుమతితో పెళ్లయ్యాక కూడా అమల సినిమాల్లో నటిస్తూనే వుంది. ఇద్దరూ తమ అన్యోన్యాన్ని ప్రదర్శిస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేవారు కూడా. ఆ మధ్య గర్భవతి అని వార్తలు రాగానే ఉలికిపడి అదంతా ఉత్తదేనని చెప్పారు.

 అయితే, ఇటీవలి కాలంలో వీరిద్దరి మధ్యా మనస్పర్థలు తలెత్తాయని, అవి చాలా దూరం వరకూ వెళ్లాయని  ప్రచారం ఊపందుకోంది. గత రెండు నెలలుగా వీరిద్దరూ కలసి బయట ఎక్కడా కనిపించకపోవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. ఏమైనా, ఈ విషయంపై వీరిలో ఎవరో ఒకరు స్పందిస్తేనే ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడేదీ.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywwod  actress  amala paul  vijay  marriage  divorce  

Other Articles

Today on Telugu Wishesh