హ్యాపీ డేస్ దర్శకుడు గ్యారీ మార్షల్ కన్నుమూత | happydays director Garry Marshall passes away

Happydays director garry marshall passes away

Happydays director passes away, Garry Marshall is no more, Hollywood director passes away, comedy shows director died, pretty woman director died

Happydays director Garry Marshall passes away at age of 81.

హాలీవుడ్ టాప్ డైరక్టర్ కన్నుమూత

Posted: 07/21/2016 07:53 AM IST
Happydays director garry marshall passes away

ప్రముఖ దర్శకుడు గ్యారీ మార్షల్ (81) కన్నుమూతపై హాలీవుడ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. నిమోనియాతో బాధపడుతున్న ఆయన అమెరికా లాస్ ఏంజిల్స్ లోని ఒక ఆసుపత్రిలో మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. రొమాంటిక్ కామెడీ షోలు, సినిమాలతో అమెరికన్ టీవీ రంగాన్ని, హాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన దర్శకుడు ఈయన.

న్యూయార్క్ లో జన్మించిన గ్యారీ అక్కడే పెరిగారు. జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం ఒక పత్రికలో సినీ గాసిప్స్ రాసేవారు. ఈ గాసిప్స్ అద్భుతంగా పండటంతో హాస్య నటుడు జాయ్ బిషఫ్ ఆయన్ని లాస్ ఏంజిల్స్ తీసుకువెళ్లి తన టాక్ షో కు డైలాగ్ రైటర్ గా నియమించుకున్నారు. దీంతో మంచిపేరు సంపాదించుకున్న ఆయన ఇక వెనుదిరిగి చూడలేదు.

కాగా, గ్యారీ రూపొందించిన సిచ్యువేషనల్ కామెడీ షో ‘హ్యాపీ డేస్’ ఆయనకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. 1974 నుంచి 1984 వరకు అమెరికా టీవీ రంగాన్ని ఈ టీవీ షో సంచనాలు సృష్టించింది.. ‘న్యూ ఇయర్ ఈవ్’, ‘వాలెంటైన్స్ డే’, ‘ది ప్రిన్సెస్ డైరీస్’, ‘బీచెస్’తో పాటు ఈ ఏడాది విడుదలైన ‘మదర్స్ డే’ చిత్రం వరకు ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. వీటితో పాటు నలభై కామెడీ షోలను కూడా ఆయన రూపొందించారు. ది లూసీ, ది డిక్ వాన్ డైక్, హ్యాపీ డేస్ వంటి పలు టీవీ షోలను రూపొందించి తన స్థానాన్ని పదిలపరచుకున్నారు. ఆయనకు భార్య (బార్బరా), ముగ్గురు పిల్లలు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hollywood  comedy shows  director  Garry Marshall  passes away  

Other Articles

Today on Telugu Wishesh