కబాలిపై ప్రత్యేక కథనం | Superstar Rajinikanth Kabali special story

Superstar rajinikanth kabali special story

Rajinikanth Kabali special story, Superstar Rajinikanth, Kabali review, kabali telugu review, kabali telugu movie, rajani kabali review, kabali movie review, Kabali Review, Kabali updates, kabali behins scenes, Rajanikanth about Kabali, Rajanikanth craze, Kabali craze

Superstar Rajinikanth Kabali special story

కబాలిలో అసలు ఏముంది

Posted: 07/20/2016 10:10 AM IST
Superstar rajinikanth kabali special story

65 ఏళ్ల ముదుసలి డాన్ కబాలి కోసం ప్రపంచమంతా పడిగాపులు కాస్తున్నారు. ఒకప్పుడు కేవలం తమిళ తంబీలు మాత్రమే తలైవా పిచ్చి, ఇప్పుడు ప్రాంతం, భాష సంబంధం లేకుండా లోకమంతా వీరాభిమానులుగా మారిపోయారు. హాలీవుడ్ తర్వాత ప్రపంచానికి అంతగా పరిమితమైంది బాలీవుడ్, అలాంటిది అక్కడి స్టార్ల క్రేజ్ కూడా ఆయనతో పోల్చుకుంటే అట్టడుగు స్థాయే. ఒక కోలీవుడ్ కాదు ఇప్పుడు ప్రతీ వుడ్డూలో కబాలి నామస్మరణం మారుమోగిపోతుంది. అందుకు కారణం రజనీ కాంత్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దీనికి ముందు వచ్చిన రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్. దారుణమైన నష్టాలను రుచిచూపాయి. వేరే ఏ హీరో అయినా ఆ బాధ నుంచి కోలుకునే వాడు కాదు. కానీ, సూపర్ స్టార్ కదా... అంతకు రెట్టింపు ఉత్సాహంతో జనాల్లోకి వస్తున్నాడు. స్వతహాగా మంచి మనిషి అని పేరు ఉండటంతో ఆయన క్రేజ్ నానాటికీ పెరుగుతుందే తప్ప, తగ్గటం లేదు. డైరక్టర్ ఎవరైనా సరే గౌరవించి వారి చెప్పింది చేసుకుంటూ పోతాడు. వయసు పైబడుతున్న, ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్న ఫ్యాన్స్ కోసమే నాజీవితం అంటుంటాడు.

సరిగ్గా పాతికేళ్ల క్రితం అనుకుంటా... అన్నామళై (తెలుగులో వెంకటేష్ కొండపల్లి రాజా) అనే ఓ చిత్రం వచ్చింది. అప్పటికీ రజనీకాంత్ అంటే మాస్ జనాలను మెప్పించే ఓ మాములు హీరో. కట్ చేస్తే... ఆ చిత్రం రిలీజ్ అయ్యాక రజనీకాంత్ ప్రతీ చిత్రానికి కటౌట్లకు పాలాభిషేకం చేయటం తంబీలకు ఓ వ్యసనంగా మారింది. మూడేళ్లకు మళ్లీ కట్ చేస్తే భాషా అంటూ ఓ చిత్రం వచ్చింది. ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు.... అంటూ మాణిక్యం అలియాస్ మాణిక్ భాషా వేసే డైలాగూ గుర్తు చేసుకోని తెలుగు ప్రేక్షకుడు ఉంటాడా? ఈ చిత్రంతో రజనీకాంత్ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఎంతలా అంటే ఇప్పటికీ ఏ హీరో ఆయన శిఖరాలను అందుకోలేనంతగా....

సినిమా సినిమాకి రజనీ అభిమానుల పరంపర పెరిగిపోతూనే వస్తోంది. వేలిని పైకి లేపిన, కండువా మెళ్లో వేసుకున్నా, నోటికి అమాంతం దూరం నుంచి సిగరెట్ పీక నోట్లో వేసుకున్నా, ఆఖరికి నడిచిన అదీ ఓ స్టైల్ అయి కూర్చుంది. యువ హీరోలు ఎందరు వచ్చినా సరే రియల్ స్టైలిష్ స్టార్ రజనీయే. జనాలు అంతగా ఆయనకు అలవాటు కాదు..కాదు... బానిసలుగా మారిపోయారు. ఇప్పుడు 65 ఏళ్ల వయసులో కూడా డాన్ అవతారంలో అదే స్టైల్ ... జనాల్లోనూ అవే అంచనాలు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేదు రజనీ సినిమా అంటే ఎప్పటికప్పుడు ఫస్ట్ డే ఓపెనింగ్స్ రికార్డు బద్ధలుకావాల్సిందే. ఇప్పుడు కబాలి విషయంలోనూ అంతకు మించే అద్బుతాలు జరగబోతున్నాయన్నది సుస్ఫష్టం.



అమెరికాలో 400 థియేటర్లు, ప్రపంచ వ్యాప్తంగా 5000 వేల థియేటర్లు, త్వరలో చైనాలో 3 వేల థియేటర్ల ఈ సంఖ్యను చూస్తే కబాలి మేనియా ఏంటో ఇట్టే అర్థమైపోతుంది.  ఇక పొతే మలేషియాలో మలయా డబ్బింగ్ 29న రిలీజ్ అవుతోంది.  చైనాలో సెప్టెంబర్ లో మాండరిన్ భాషలో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. ఇప్పటికే అక్కడ రిలీజైన ట్రైలర్ దుమ్మురేపుతోంది. ఇంకా థాయ్, ఇండోనేషియా, జపాన్ భాషల్లో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. అంచనాలకు అందని రీతిలో  ప్రీ బిజినెస్ 230 కోట్ల పైమాటే. తోలిరోజు కలెక్షన్లు దుమ్ములేపటం ఖాయం. తమిళనాట ఇప్పుడు ఎక్కడా చూసిన వారం దాకా కబాలి టికెట్లు లేవు అన్న బోర్డులే దర్శనమిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి.

కబాలి అనేది మూడు అక్షరాలే. కానీ, ఇప్పుడు అది లేని ప్రదేశం ఎక్కడా కనిపించడం లేదు. గత వారం రోజులుగా ఈ ఫీవర్ మరీ ఎక్కువైపోతుంది. చిన్న పిల్లలు కొనుక్కునే చాక్లెట్లు, బిస్కెట్ల, సిమ్ కార్డుల దాకా, కార్ల నంబర్ ప్లేట్ల దగ్గరి నుంచి ఫ్లైయిట్ల దాకా పాకిపోయింది. విచిత్రం ఏంటంటే హాలీవుడ్ సినిమా ఐఎస్ఏజ్  చిత్ర ప్రమోషన్ కు కూడా కబాలినే వాడుకోవటం విశేషం. ఓ ఫైనాన్స్ సంస్థ అయితే ఏకంగా నాణేలు ముద్రించి అమ్మకానికి పెట్టడం ఒక ఎత్తు అయితే అవి హాట్ కేకుల్లా అమ్ముడుపోవటం మరో ఎత్తు. ఆయన క్రేజ్‌ దృష్ట్యా ఎవరు ఎలా వాడుకోవాలలో అలా వాడేసుకుంటున్నారు. ఉత్పత్తుల ప్రచారం దగ్గరి నుంచి ప్రభుత్వ పథకాల దాకా అన్ని కబాలి పేరు మీదే నడుస్తున్నాయి. ఇక ఇంకోవిచిత్రం ఏంటంటే... కనివిని ఎరుగని రీతిలో కొన్ని కార్పోరేట్‌ సంస్థలు ఉద్యోగులకు సెలవు ప్రకటించడమే కాదు ఫ్రీగా సినిమా చూపించేందుకు సిద్ధమైపోతున్నాయి.

ఇప్పుడు ప్రతీ ఒక్కరి కళ్లకు కబాలి తప్ప మరోకటి కనిపించడం లేదు. ప్రపంచంలో ఏ నటుడికి కూడా ఇంతలా గౌరవం దక్కి ఉండదు.. భవిష్యత్తులో దక్కబోదు కూడా... దటీజ్ రజనీ...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood  Superstar  Rajanikanth  Kabali  July 22  

Other Articles