థమన్ తిక్కకి ఈసారి ఎవరంటే... | Hero dhanush sings for thikka movie title song

Hero dhanush sings for thikka movie song

Sai Dharam Tej Thikka song, Dhanush for Sai Dharam Tej, Dhanush Thikka song, Thikka baby song singer, Sai Dharam Tej Dhanush, Dhanush thikka title track

Hero dhanush sings for Sai Dharam Tej's thikka movie song.

థమన్ తిక్కకి ఈసారి ఎవరంటే...

Posted: 07/20/2016 12:34 PM IST
Hero dhanush sings for thikka movie song

మ్యూజిక్ డైరక్టర్ థమన్ కి తెలుగులో ఇప్పుడు అవకాశాలు చాలా తగ్గిపోయాయి. నాసిరకం ట్యూన్స్ అందిస్తున్నాడనే కంప్లైంయిట్ తోపాటు, సక్సెస్ రేటు కూడా బాగా తగ్గిపోవటంతో దర్శకులు అతడి వైపే చూడటం తగ్గించేశారు. కానీ, చిన్న చిత్రాల దర్శకులు మాత్రం థమన్ ను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అంటున్నారు.

మెగా వారసుడు సాయిధరమ్ తేజ తిక్కతోపాటు, చుట్టాలబ్బాయికి థమనే సంగీతం అందించాడు. ఇక తన ప్రతీ సినిమాలో ఆ చిత్ర హీరోలతోపాటు, బయటి హీరోలతో కూడా పాటలు పాడించడం ఇతగాడికి ఎప్పటి నుంచో ఉన్న అలవాటే. ఎన్టీఆర్ కోసం శింబు, పునీత్ రాజ్ కుమార్ కోసం ఎన్టీఆర్, అంతేకాదు కాజల్ లాంటి హీరోయిన్ల చేత కూడా పాటలు పాడించిన ఘనత థమన్ ది. ఇక ఇప్పుడు మెగా హీరో చిత్రంలో ఓ తమిళ స్టార్ హీరో పాట పాడడం ఇప్పుడు పెద్ద న్యూస్ అయింది.

ఈ ముచ్చట సాయిధరం తేజ్ హీరోగా రూపొందుతున్న 'తిక్క' సినిమాలో చోటు చేసుకుంది. ఈ చిత్రం కోసం ప్రముఖ తమిళ హీరో ధనుష్ టైటిల్ సాంగును పాడడం జరిగింది. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు థమన్ తాజాగా ట్వీట్ చేశాడు. ధనుష్ మంచి గాయకుడన్న సంగతి మనకు తెలుసు. 3 సినిమా కోసం వైదిస్ కోలవెరి అంటూ పెద్ద సెన్సేషనే క్రియేట్ చేశాడు. తన సినిమాల్లోనే కాకుండా అప్పుడప్పుడు బయటి చిత్రాలలో కూడా పాడుతుంటాడు. యుగానికొక్కడులో నీమీదే ఆశగా... తెలుగు పాట పాడింది అతడే. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత థమన్ రిక్వెస్ట్ పై ఈ 'తిక్క' సినిమాలో పాడడం జరిగింది. ఏమైనా, ఈ చిత్రానికి అది కూడా ప్లస్ అవుతుందని అనుకోవచ్చు. సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhanush  Sai Dharam Tej  Thikka  song  SS thaman  

Other Articles