allari naresh agrees to act in kollywood movie

Allari naresh signs a straight tamil movie

Allari Naresh, Allari Naresh miovies, Allari Naresh hits, Allari Naresh songs, Allari Naresh comedy hits, Allari Naresh direction, Selfie raja, Samuthirakhani, tollywood comedy star, kollywood

Tollywood actor Allari Naresh who played the lead role as an actor in various movies, is now getting ready to test his luck in direction field.

అరవ చిత్రానికి అల్లరి నరేష్ అంగీకారం..

Posted: 07/17/2016 12:49 PM IST
Allari naresh signs a straight tamil movie

సెల్పీరాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి నరేష్ త్వరలో ఓ స్ట్రయిట్ తమిళ సినిమా నటించేందుకు అంగకీరించాడు. ఇప్పటికే కురుంబు, పొరలి లాంటి తమిళ సినిమాల్లో నటించిన నరేష్ మరోసారి తమిళ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. అల్లరి నరేష్ కీలక పాత్రలో తెరకెక్కిన శంభో శివ శంభో సినిమాకు దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు సముద్రఖని, ఈ అల్లరోడితో మరోసారి తమిళ సినిమా చేయించాలని డిసైడ్ అయ్యాడు.

స్టార్ ఇమేజ్కు దూరంగా నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్న పాత్ర కావటంతో నరేష్ కూడా వెంటనే అంగకీరించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. నరేష్ హీరోగా తెరకెక్కిన సెల్పీరాజా ఈ శుక్రవారం రిలీజ్ కాగా మరో రెండు తెలుగు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. హర్రర్ కామెడీగా తెరకెక్కుతున్న మా ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం సినిమాలో నటిస్తున్నాడు నరేష్. ఈ సినిమా తరువాత ప్రముఖ నటుడు కృష్ణభగవాన్ కథా కథనాలు అందిస్తున్న మేడ మీద అబ్బాయి సినిమా పటాలెక్కనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allari Naresh  Selfie raja  Samuthirakhani  tollywood comedy star  kollywood  

Other Articles