బాలయ్య కోసం నేషనల్ అవార్డ్ విన్నర్ | Designer Neetu Lulla working for Balayya's GPS Movie

Designer neetu lulla working for balayya s gps movie

Famous designer Neetu Lulla, Balayya's GPS Movie, national award winner for balayya's movie, Gautamiputra Satakarni Neetu Lulla, Neetu Lulla for Gautamiputra Satakarni

Famous designer Neetu Lulla working for Balayya's GPS Movie.

బాలయ్య కోసం నేషనల్ అవార్డ్ విన్నర్

Posted: 07/16/2016 05:40 PM IST
Designer neetu lulla working for balayya s gps movie

చరిత్రకు సంబంధించిన సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తినెలకొనటం సహజమే. విజువల్ ఎఫెక్ట్స్, సెట్టింగ్ లు, కాస్టూమ్స్ ఇలా ప్రతీ అంశంలో ఏం చూపించబోతున్నారనే ఆత్రుత ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. అదే సమయంలో ఆయా చిత్రాలకు కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేయడం అంత తేలికైన విషయం కాదు. అప్పటి సంస్కృతీ సంప్రదాయాలపై అధ్యయనం చేసి, వేషధారణపై ఒక అవగాహనకి రావలసి ఉంటుంది.

ప్రస్తుతం బాలయ్య వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమానే అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ చిత్రానికి జాతీయ అవార్డు గెలుచుకున్న నీతా లుల్లా ను కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్నారంట. గతంలో జోథా అక్బర్ సినిమాకు పనిచేసిన నీతా బాలయ్య 100f సినిమా కోసం పని చేయటం విశేషమే. ఇందుకోసం శాతవాహనుల కాలం నాటి సంస్కృతీ సంప్రదాయాలపై పరిశోధన చేసిన అనంతరమే ఆమె ఈ కాస్ట్యూమ్స్ సిద్ధం చేసిందట.

ఇండియాలోని అత్యుత్తమ మేకర్స్ తో ఆభరణాల డిజైన్స్ గీయించి, వాటిని తయారు చేయిస్తోందని అంటున్నారు. బాలకృష్ణతోపాటు శ్రీయా, హేమామాలిని వంటి ప్రధాన పాత్రల లుక్ పై ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఆమె డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనే చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రస్తుతం జార్జియా షూటింగ్ లో ఆమె దగ్గరుండి అంతా చూసుకుంటుందని తెలుస్తోంది.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Neetu Lulla  Jodha Akbar  Balakrishna  100th Movie  GPS  

Other Articles