పవన్ ఈసారైనా రికార్డు బ్రేక్ చేస్తాడా? | Will Pawan SGS smash TRP ratings in small screen

Will pawan sgs smash trp ratings in small screen

Pawan Kalyan Sardar Gabbar Singh in TV, Pawan Kalyan SGS MAA TV, Sardar Gabbar Singh MAA, Sardar Gabbar Singh news, Pawan Kalyan TRP king, PK SGS

All eyes on Pawan Kalyan Sardar Gabbar Singh small screen telecasting.

పవన్ ఈసారైనా రికార్డు బ్రేక్ చేస్తాడా?

Posted: 07/16/2016 03:16 PM IST
Will pawan sgs smash trp ratings in small screen

సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి నెగటివ్ టాక్ సినిమాతో కూడా 50 కోట్ల కలెక్షన్లు రాబట్టగలిగాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాగే కలెక్షన్ల పరంగా మగధీరను అధిగమించి తెలుగు సినిమా స్థాయిని వంద కోట్ల క్లబ్ కు చేరువగా తీసుకెళ్లింది పవన్ అత్తారింటికి దారేది. ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో  రికార్డు కలెక్షన్లను కుమ్మేసింది. కానీ, ఒక్క చోట మాత్రం అది రికార్డులను బ్రేక్ చేయటంలో ఫ్లాప్ అయ్యింది.

అదే బుల్లి తెర. హీరో ఎవరన్నా తేడా లేకుండా క్రేజ్ సినిమాలను వేడి వేడిగా ఉన్నప్పుడే స్మాల్ స్క్రీన్ పైకి వదిలి చానెళ్లు టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్తున్నాయి. అయితే కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలకు కూడా బుల్లితెరపై చేదు అనుభవం ఎదురైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు ఎన్టీఆర్ టెంపర్ సినిమా 23.5 రేటింగ్ తో తెలుగు టీఆర్పీ రేటింగ్ లో సెకండ్ ప్లేస్ లో నిలిస్తే, విజువల్ వండర్ బాహుబలి మాత్రం 21.54 రేటింగ్ తో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక వెంకీ దృశ్యం సినిమా కమర్షియల్ హంగులు లేకపోయినా స్మాల్ స్క్రీన్ పై ఎక్కువసార్లు వీక్షించినా సినిమాగా నిలిచింది. మహేష్ ఆగడు సినిమా కూడా అంతే కమర్షియల్ గా అట్టర్ ఫ్లాప్ అయినా ఈ సినిమాకు టీఆర్పీ రేటింగ్ ఎప్పటికప్పుడు ఎక్కువగానే వస్తోంది.

సో... ఈ లెక్కన బుల్లితెరపై సక్సెస్ కి సినిమాల హిట్-ఫ్లాపులకు ఏ మాత్రం సంబంధం లేదనే అర్థమైపోతోంది. ఈ క్రమంలో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం ఆదివారం మా టీవీలో టెలికాస్ట్ కాబోతుంది. ఇప్పటి దాకా అత్తారింటికి దారేది పవన్ కెరీర్ లో టీఆర్పీ (19.84) అధికంగా ఉన్న చిత్రం. మరి ఈ సర్దార్ ఆ రికార్డును చెరిపేస్తాడా? లేక ఈ ప్లాప్ సినిమాతోనే కొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడా? తెలియాలంటే కొద్దిగంటలు ఆగాల్సిందే.  

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Sardar Gabbar  MAA TV  TRP ratings  

Other Articles