మురగదాస్ సినిమాలో సమంత తల్లి | Nadhiya key role in Mahesh Murugadoss movie

Nadhiya key role in mahesh murugadoss movie

Nadhiya in Mahesh-Murugadoss movie, Nadhiya in mahesh movie, SJ Suryah’s wife nadiya, Nadhiya as Suryah’s wife

Nadhiya key role in Mahesh Murugadoss movie. Nadhiya will play the role of SJ Suryah’s wife character.

మురగదాస్ సినిమాలో సమంత తల్లి

Posted: 07/16/2016 03:09 PM IST
Nadhiya key role in mahesh murugadoss movie

సూపర్ స్టార్ మహేష్ సినిమాకు సంబంధించి ఒక్కో పాత్రకు నటుల ఎంపికను ఆచీతూచీ చేస్తున్నాడు దర్శకుడు ఏఆర్ మురగదాస్. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ ను ఎంపిక చేయగా, దర్శకుడు ఎస్ జే సూర్య విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కీలకమైన ఓ పాత్ర కోసం ఓ సీనియర్ నటిని ఎంపిక చేసినట్లు సమాచారం.

ఈ మధ్య అత్త పాత్రలకు ప్రాణం పోస్తున్న నటి నదియాను తీసుకున్నట్లు తెలుస్తోంది. అత్తారింటికి దారేదిలో, ఈ మధ్య వచ్చిన అ.ఆ...లో పొగరుబోతు గి(అ)త్తగా అద్భుతమైన ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చింది నదియా. ఈ రెండు సినిమాల్లోనూ ఆమె సమంతకు తల్లిగా నటించడం విశేషం. ప్రస్తుతం మహేష్ సినిమాకు సంప్రదించగా, అందుకు ఆమె అంగీకరించినట్లు సమాచారం.

ఇక ఈ సినిమాలో ఎస్ జే సూర్యకి భార్య పాత్రలో ఆమె కనిపించబోతున్నారంట. అంతేకాదు వీరిద్దరి మధ్య లవ్ యాంగిల్ ను కూడా చూపించబోతున్నాడంట. వందకోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోయే ఈ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ అల్రెడీ పూర్తి చేసి, ముహుర్తం షాట్ కోసం ఎదురు చూస్తున్నాడు దర్శకుడు మురగదాస్.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nadhiya  wife  SJ Suryah  Mahesh Babu  Murugadoss  Rakul Preet Singh  

Other Articles