బన్నీ అతితెలివి ప్రదర్శిస్తున్నాడు | bunny intelligent technique to overcome leaks

Bunny intelligent technique to overcome leaks

Allu Arjun on leaks, Allu Arjun Harish Shankar, Harish Shankar Allu Arjun Movie, Stylish Star Personal Staff, Allu Arjun much care about personal staff, Bunny Shruthi Hassan

Allu Arjun is planning to use some intelligent technique to overcome leaks from his upcoming projects and decided to involve only non local, non-Telugu speaking staff.

బన్నీ అతితెలివి ప్రదర్శిస్తున్నాడు

Posted: 07/16/2016 01:12 PM IST
Bunny intelligent technique to overcome leaks

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకు, అందులోని తన క్యారెక్టర్ పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటాడో తెలిసిందే. హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ ఇలా అన్ని విషయాల్లో ఎప్పటికప్పుడు కొత్త ఒరవడి సృష్టిస్తుంటాడు. హ్యాట్రిక్ హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న బన్నీ ప్రస్తుతం గబ్బర్ బాబా హరీష్ శంకర్ తో వండర్ చేసేందుకు సిద్ధమైపోతున్నాడు. హీరోయిన్ గా శృతీహాసన్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం బన్నీ ఓ కొత్త సాంప్రదాయాన్ని పాటించబోతున్నాడంట.

సాధారణంగా సినిమాకు సంబంధించి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఎవరో ఒకరి ద్వారా లీకేజీలు బయటికి వచ్చేస్తుంటాయి. కాస్ట్ క్రూ, డైలాగులు, పాటలు, మేకింగ్ వీడియోల దాకా సినిమాకు సంబంధించి ప్రతీ విషయంలోనూ చిత్ర యూనిట్ కు తలనొప్పులే. ఇప్పుడు రాబోతున్న సినిమాల విషయంలో ఇది మరీ దారుణంగా ఉంది. అలాగే సరైనోడు టైంలో కూడా ఇలాంటివి జరిగాయి. దీంతో తన అప్ కమింగ్ విషయంలో ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని భావిస్తున్నాడంట బన్నీ.

తన సిబ్బంది కారణంగానే సరైనోడు లీకేజీలు బయటికి వెళ్లాయని భావించిన బన్నీ మేకప్ దగ్గరి నుంచి హెయిర్ స్టైలింగ్ వరకు అందరినీ తెలుగు తెలియని వారిని, నాన్ లోకల్స్ ని నియమించుకున్నాడంట. అంతేకాదు షూటింగ్ స్పాట్ లో సిబ్బందిని మినహాయించి పర్సనల్ స్టాఫ్ పెట్టుకునే నటీనటులకు కూడా ఇదే ఫాలో అవ్వమని సూచిస్తున్నాడంట. తద్వారా చిత్రానికి సంబంధించిన విషయాలను కొంతలో కొంతయినా బయటికి పొక్కనీయకుండా ఛాన్స్ ఉంటుందని ఈ అల్లు వారబ్బాయి ఆలోచన.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Personal Staff  Gabbar Singh  Harish Shankar  Shruthi hassan  

Other Articles