మోస్ట్ వాంటెడ్ కబాలి | Kabali Makers released Rajinikanth Wanted Poster

Kabali makers released rajinikanth wanted poster

Kabali Posters, Rajanikanth Kabali posters, Rajanikanth Kabali Caricature poster, Rajinikanth Caricature poster, Kabali therters, Rajinikanth kabali most wanted

Kabali Makers released Rajinikanth Caricature Wanted Poster.

మోస్ట్ వాంటెడ్ కబాలి

Posted: 07/16/2016 11:18 AM IST
Kabali makers released rajinikanth wanted poster

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి చిత్రం రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. జూలై 22న దాదాపు 5000 థియేటర్లో ప్రపంచవ్యాప్తంగా సందండి చేసేందుకు తలైవా సిద్ధమైపోతున్నాడు. ఒక్క అమెరికాలోనే 400 స్క్రీన్ లంటే మాములు విషయం కాదు. ఇక చిత్ర యూనిట్ కూడా ప్రచారాన్ని రోజుకో టైపులో కానిచ్చేస్తోంది.

ఫ్లైట్స్, టాయిలెట్స్, కాయిన్స్ ఇలా దేన్ని వదలకుండా వాడేసుకుంటున్నారు.  ఇది ఎక్కడి దాకా వెళ్లిందంటే సంక్షేమ పథకాలను కూడా సక్సెస్ చేసేందుకు ప్రభుత్వాలు కబాలిని వాడేసుకుంటున్నాయి. ముసలి డాన్ గానే కాదు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో యంగ్ రజనీని చూస్తే మైమరిచిపోని వారు ఉంటారా? కబాలి మేకర్స్ తాజాగా విడుదల చేసిన ఓ డ్రాయింగ్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరస్ లా పాకిపోతుంది.

పేపర్ పై సింగిల్ లైన్ తో గీసిన ఈ ఫోటోలో యంగ్ రజనీ కాంత్, ఆ పక్కనే ఓ గన్... సింపుల్ గా అదిరిపోయింది అంతే. సినిమాపై వస్తున్న రూమర్స్ అన్ని పక్కనబెట్టి మోస్ట్ వాండెట్, డాన్ లకే డాన్ అయిన కబాలిని చూసేందుకు రెడీ అయిపోండి.

- భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajanikanth  Kabali  Pa Ranjith  posters  

Other Articles

Today on Telugu Wishesh