రాజ్ తరుణ్ సరసన ఆక్సిజన్ బ్యూటీ | Anu Emmanuel to pair up with Raj Tarun

Anu emmanuel to pair up with raj tarun

Raj Tarun Next Movie, Raj Tarun with Dongata Director, Anu Emmanuel telugu movie, Anu Emmanuel Raj Tarun, Raj Tarun with Anu Emmanuel, Oxygen beauty for Raj Tarun

Anu Emmanuel to pair up with Raj Tarun for Vamshi krishna Movie.

తరుణ్ కి ఆక్సిజన్ ను అందిస్తున్నారు

Posted: 07/16/2016 10:30 AM IST
Anu emmanuel to pair up with raj tarun

ఎనర్జిటిక్ నటుడు రాజ్ తరుణ్ హ్యట్రిక్ హిట్ల తర్వాత సీతమ్మ అందాలు చిత్రంతో... తొలి ఫ్లాప్ ను చవిచూశాడు. అయినా ఈడో రకం ఆడో రకంతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు దొంగాట దర్శకుడు వంశీ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నాడు. మైండ్ గేమ్ తో తెరకెక్కించబోయే ఈ చిత్రం కోసం కూడా పరభాష హీరోయిన్ ను తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

మళయాళీ బ్యూటీ అను ఇమ్మానుయెల్ సినిమా డెబ్యూనే తెలుగు నుంచి ప్రారంభించబోతుంది. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆక్సిజన్ లో ఈ హాట్ బ్యూటీ నటిస్తోంది. కథ నచ్చటంతో రాజ్ తరుణ్ సినిమాకు ఒప్పుకుందట. స్వతహాగా మోడల్ అయిన అను పెరిగింది అంతా లండన్ లోనే. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన అనంతరం నేరుగా తెలుగు చిత్రాలకే ఆమె మొగ్గు చూపటం విశేషం.

తాను అనుకున్న పాత్రకి ఆమె అయితేనే కరెక్ట్ గా సరిపోతుందని దర్శకుడు వంశీ కృష్ణ చెబుతున్నాడు. అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరించబోతున్న ఈ చిత్రం త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుంది. అన్నట్లు నానితో సినిమా డైరక్టర్ విరించి వర్మ తీయబోయే సినిమాలో కూడా అనుయే హీరోయిన్.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raj Tarun  Oxygen  Anu Emmanuel  Director Vamshi krishna  

Other Articles

Today on Telugu Wishesh