వావ్.... వరుణ్ ధావన్ తో మాధురి దీక్షిత్‌ | Shah Rukh trolls Varun and Madhuri's Devdas Dubsmash

Shah rukh trolls varun and madhuri s devdas dubsmash

Madhuri Dixit's Devdas Dubsmash, Varun Dhawan and Madhuri Dixit's video, Shah Rukh Khan funny reply to Devdas Dubsmash

Shah Rukh Khan funny reply to Varun Dhawan and Madhuri Dixit's Devdas Dubsmash.

వరుణ్ తో మాధురి తప్పేం లేదు బ్రదర్!

Posted: 07/13/2016 05:32 PM IST
Shah rukh trolls varun and madhuri s devdas dubsmash

బాలీవుడ్ 90's బ్యూటీ మాధురి దీక్షిత్, యువనటుడు వరుణ్ ధావన్... ఈ ఇద్దరు జంటగా నటిస్తే ఎలా ఉంటుంది. ఛా... ఛాన్సే లేదంటారా? కానీ, వీళ్లద్దరి కలిసి నటించిన ఓ వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. కానీ, అది సినిమా కోసమో, కనీసం యాడ్ కోసమో కాదు. అయినా నటించారు. దర్శక దిగ్గజం సంజయ్ లీలా బన్సాలీ డైరక్షన్ లో వచ్చిన దేవదాస్ చిత్రానికి జూలై 12తో సరిగ్గా 14 ఏళ్లు పూర్తయ్యింది.


ఈ సందర్భంగా షారూఖ్ ఖాన్ అందులోని ఓ డైలాగ్ ను నిన్న డబ్ స్మాష్ చేసి తన ట్విట్టర్ లో  పెట్టాడు. బాబూజీ నే కహా... అంటూ డైలాగ్ చెప్పి సంజయ్ లీలా బన్సాలీకి కృతజ్నతలు చెప్పుకున్నాడు బాద్ షా. ఇక ఇదే డైలాగ్ పై మాధురి దీక్షిత్ కూడా డబ్ స్మాష్ చేసింది. ఇందుకోసం యువనటుడు వరుణ్ ధావన్ సాయం తీసుకుంది. ఇద్దరు కలిసి ఈ డైలాగ్ ను పూర్తి చేశారు. అయితే దీనికి షారూఖ్ తనదైన శైలిలో సెటైర్లు వేశాడు.


చంద్రూ...(దేవదాస్ లో మాధురి పాత్ర) అది నేను(దేవదాస్) కాదు ధావన్ దాస్... అతను నాలా తాగడు, ఆరోగ్యంపై చాలా శ్రద్ధ ఎక్కువ, అసలు నీ గొంతుకు ఏమైందంటూ రిప్లై ఇచ్చాడు. ఇది చూస్తున్న వారు ఎలాగూ వరుణ్ షారూఖ్ కి తమ్ముడేగా(దిల్ వాలే సినిమాలో...) ఫర్వాలేదు... తప్పేం లేదంటూ తింగరి కామెంట్లు చేస్తున్నారు.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devdas  Shah Rukh Khan  Madhuri Dixit  Varun Dhawan  Dubsmash  

Other Articles