సింగపూర్ కబాలి రైట్స్ కొన్న హీరో ఎవరంటే... | Actor arun pandian acquired kabali singapore rights

Actor arun pandian acquired kabali singapore rights

Actor Arun Pandian kabali, kabali singapore rights, actor grabbed kabali rights

Actor Arun Pandian acquired kabali singapore rights.

కబాలి కోసం కోట్లు కుమ్మరించిన హీరో

Posted: 07/13/2016 04:29 PM IST
Actor arun pandian acquired kabali singapore rights

క్లీన్ యూ సర్టిఫికెట్ తో వెండితెరపై దండయాత్ర చేసేందుకు సిద్ధమైపోతున్నాడు కబాలి. తమిళ్, తెలుగు, హిందీతోపాటు వారం గ్యాప్ ఇచ్చి ప్రత్యేకంగా మలేషియా బాష మలై వర్షన్ లో కూడా దీనిని రిలీజ్ చేయబోతున్నారు. మెజార్టీ భాగం షూటింగ్ మలేషియాలో షూటింగ్ చేసుకోవటమే కాదు అక్కడా తలైవాకు భారీ ఫాన్స్ ఫాలోయింగ్ ఉండటమే ఇందుకు కారణం.

ఇక చిత్ర శాటిలైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడు పోతున్నాయి. ఇప్పటికే 120 కోట్ల ఫ్రీ బిజినెస్ చేసినట్లు సమాచారం. మన దేశంలోనే కాదు విదేశాల్లో రజనీ పట్ల ఉన్న క్రేజ్ ను నిర్మాతలు భారీగానే క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పడు ఈ చిత్ర సింగపూర్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

నటుడు, నిర్మాత అరుణ్ పాండియన్ ఫ్యాన్సీ రేటుకు ఈ చిత్ర సింగపూర్ హక్కులను కొనుగోలు చేశాడంట. ఈ విషయాన్ని నిర్మాత కలై పులి థాను ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఒకప్పుడు తమిళ్ తోపాటు, తెలుగు చిత్రాల్లో కూడా హీరోగా నటించాడు అరుణ్ పాండియన్. దాడి, నక్షత్ర పోరాటం, దొంగల రాజ్యం, న్యాయ రక్షణ, నేరం తదితర చిత్రాల్లో నటించాడు. చివరగా నితిన్ ధైర్యం సినిమాలో జైలర్ పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత నిర్మాత అవతారం ఎత్తి తమిళ్ లో పలు చిత్రాలు నిర్మించడమే కాకుండా డిస్ట్రిబ్యూటర్ అవతారం ఎత్తాడు.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arun Pandian  Kabali  singapore rights  Rajani Kanth  

Other Articles