అందాల నటి కొడుకు హీరోగా వస్తున్నాడు | Bhagyashree son abhimanyu ready for debut

Bhagyashree son abhimanyu ready for debut

Abhimanyu Dassani debut, Bhagyashree son hero, Bhagyashree son abhimanyu

Actress Bhagyashree son abhimanyu Abhimanyu Dassani ready for debut.

అందాల నటి కొడుకు హీరోగా వస్తున్నాడు

Posted: 07/13/2016 06:24 PM IST
Bhagyashree son abhimanyu ready for debut

నటవారసత్వం ఇప్పుడు రెగ్యులర్ గా మనకు కనిపించేదే. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మకున్నట్లు... కొడుకులు, అల్లుళ్లు, కూతుళ్లు ఇలా పుట్టగొడుగుల్లా పుట్టుకోచ్చేస్తున్నారు. ఈ సంస్కృతికి టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అన్న భాషాబేధం లేదు. అయితే హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా వారసులు గా రాణించడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. హీరోల కోడుకులు, కూతుళ్లు తెరపైకి వస్తున్నారంటే షరా మాములుగా మారిపోయింది. కానీ, బాలీవుడ్ ను తొలి చిత్రం తోనే షేక్ చేసిన ఓ బ్యూటీ కొడుకు త్వరలో హీరోగా దర్శనమివ్వబోతున్నాడన్నది విశేషమే కదా.

తొలి చిత్రమే సల్మాన్ ఖాన్ ‘మైనే ప్యార్ కియా’ లో నటించి బాలీవుడ్ అలజడి రేపింది నటి భాగ్యశ్రీ. ఆమె అందంతోపాటు నటనకు ఫిదా అయిపోయారు అప్పటి యువత. ఆ తర్వాత సౌత్ తోసహా ఒకటి రెండు చిత్రాల్లో నటించినప్పటికీ అవి అంతగా ఆడలేదు. ఆపై పెళ్లి చేసుకుని కనుమరుగు అయిపోయింది. కానీ, ఇప్పుడు ఆమె తనయుడు అభిమన్యే దాసాని హీరోగా ఆరంగ్రేటం చేయబోతున్నాడు.

పలు చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేసిన అనుభవం అభిమన్యుకు ఉంది. అంతేకాదు యాక్టింగ్, డాన్స్ లో శిక్షణ తీసుకుని ఉన్నాడంట. ఫాంథమ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించబోయే ఈ చిత్రానికి వాసన్ బాలా దర్శకత్వం వహించబోతున్నాడని తెలుస్తోంది. పూర్తిస్థాయి యాక్షన్ నేపథ్యంలో ఉండబోయే ఈ చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood actress  Bhagyashree  Abhimanyu Dassani  debut  

Other Articles