దేవీశ్రీ ప్రసాద్ సినిమా అనౌన్స్ అయ్యింది | director srikishore announced devisri prasad movie

Director srikishore announced devisri prasad movie

devi sri prasad telugu movie, sri kishore devi sri prasad, Sasesham and Bhoo director, devi sri prasad telugu movie

Susesham and Bhoo movies director sri kishore announced devi sri prasad movie.

దేవీశ్రీ ప్రసాద్ సినిమా అనౌన్స్ అయ్యింది

Posted: 07/09/2016 12:40 PM IST
Director srikishore announced devisri prasad movie

సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ కున్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ యూత్ లో తన రాకింగ్ మ్యూజిక్ తో తిష్ట వేసిన దేవీశ్రీ హీరోగా ఆరంగ్రేటం చేయబోతున్నాడనే వార్త ఎప్పటి నుంచో షికారు చేస్తోంది. దీంతో అతడి క్రేజ్ ను వాడుకునేందుకు డిసైడ్ అయిపోయాడు ఓ దర్శకుడు.

దేవీ డెబ్యూ ఆ విషయం పక్కన బెడితే... టాలీవుడ్ లో త్వరలో రాబోతున్న ఓ చిత్రం ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సశేషం, భూ చిత్రాల దర్శకుడు శ్రీకిషోర్ త్వరలో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. దీనికి ‘దేవీ శ్రీ ప్రసాద్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడు. అంతేకాదు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడ విడుదల చేశాడు. ఓ శవంపై తెల్ల గుడ్డ కప్పి ఉండగా, పైన టైటిల్ ఉంది.

ఓ టాప్ కమెడియన్ ప్రధాన పాత్రలో ఇద్దరు యువహీరోలు, ఓ హీరోయిన్ తో ఈ చిత్రాన్ని తీయబోతున్నాడంట. రోటీన్ సినిమాలకు భిన్నంగా ఇది ఉండబోతుందని చెబుతున్నాడు. నటీనటుల ఎంపిక పూర్తికాగానే మిగతా విషయాలు వెల్లడిస్తానంటున్నాడు. మొత్తానికి ఈ చిన్న దర్శకుడు టైటిల్ తోనే తన సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles