samantha not intersted for any further movies

Samantha not intersted for any further movies

samantha, tollywood movies, samantha marriage, samantha rumours, samantha next movies, samantha upcoming movies, samantha movies

actress samantha not intersted in any further movies in tollywood and kollywood

సమంత ఏం చేస్తోంది... ?

Posted: 07/09/2016 12:46 PM IST
Samantha not intersted for any further movies

టాలీవుడ్ , కోలీవుడ్ లలో టాప్ హీరోయిన్ గా ఎదిగిన సమంత ఇటీవలే ఒక హీరోతో తను ప్రేమలో ఉన్నట్లుగా చెప్పింది. ఇక అప్పట్నుంచి, నాగ చైతన్యతో పెళ్లి పీటలెక్కబోతోందని అన్నింటా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై నాగ్ ఫ్యామిలీ నుంచి కానీ, సమంత నుంచి కానీ అధికారికంగా ఎలాంటి న్యూస్ రాలేదు. ఇప్పుడు దీనికోసమే ఈ అమ్మడు వచ్చిన సినిమా ఆఫర్లు అన్నీ వదులుకుంటోందట.

ముఖ్యంగా కోలీవుడ్ లో వస్తున్న ఆఫర్లు అన్నింటినీ ఈ సొట్టబుగ్గల సుందరి వదిలేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. అంతేకాకుండా, తెలుగులో కూడ ఇంకా వేరే సినిమాలకి సైన్ చేయలేదు. ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమా, అజిత్ 57వ సినిమా, అల్లు అర్జున్ హరీష్ శంకర్ల సినిమా ఇలా అన్నింటికీ నో చెప్పిందట ఈ అమ్మడు. ఇలా సినిమా ఆఫర్లు ఎందుకు వదులుకుంటోందని ఆరాతీస్తే, త్వరలో పెళ్లి చేసుకోబోతోంది కదా అందుకే అని చెప్తున్నారు అందరూ.

పెళ్లి మాట అటుంచితే, టాప్ హీరోయిన్ గా ఉన్న సమంత ఇప్పుడు ఇలా చేస్తోందేంటి అని ఫిలిం నగర్ వాసులు తెగ గుసగుసలాడేసుకుంటున్నారు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha actress  samantha hot  samanth movies  samantha next movies  

Other Articles