jr ntr janatha garage climax shooting finished

Jr ntr janatha garage climax shooting finished

jr ntr, tarak, tarak movies, jr ntr movies, jr ntr next movies, jr ntr movies, jr ntr upcoming, jr ntr janatha garage, janatha garage trailer, janatha garage movie, mohanlal janatha garage

director koratala siva prestagious project with jr ntr janatha garage shooting climax finished. only two songs pending to shoot

గ్యారేజ్ కథ క్లైమాక్స్ కి వచ్చింది..!!

Posted: 07/09/2016 11:31 AM IST
Jr ntr janatha garage climax shooting finished

జూనియర్ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ రూపొందిస్తోన్న చిత్రం ‘జనతా గ్యారేజ్‌’. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నిటస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్ ఒక కీలకపాత్రను పోషిస్తున్నాడు. ఇటీవలే విడుదల చేసిన టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్ మరింత కాన్ఫిండెంట్ గా ముందుకెళ్తోంది. అదే ఉత్సాహంతో ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ ని ఫినిష్ చేసుకుంది. రెండు పాటలు మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని, ఒక్కపాట చిత్రీకరణ కేరళలో , మరొకటి హైదరాబాద్ లో వేసిన సెట్ లో తర్వాత షెడ్యూల్ జరుపుకుంటుందని చెప్తున్నారు చిత్రయూనిట్.

ఈ సినిమా ఆడియో వేడుకల్ని త్వరలోనే నిర్వహిస్తామని, ఆగష్టు 12వ తేదిన ప్రపంచవ్యాప్తంగా సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. మూడు భాషల్లో ఈ సినిమాని ఒకేసారి విడుదలే చేస్తుంటడం విశేషం. ఈ సినిమా ఇప్పటికే కర్ణాటక, కేరళలో భారీగా బిజినెస్ చేసుకున్న సంగతి తెలిసిందే. తనకున్న అతి తక్కువ టైమ్ లో క్వాలిటీగా ఈ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు కొరటాల శివ. దీనంతటికి జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీనే కారణమని, సమ్మర్ లో ఎండలను కూడ లెక్కచేయకుండా షూటింగ్ చేశాడని అందుకే సినిమాని అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయగలుగుతున్నామని చెప్తున్నాడు దర్శకుడు.

అందుకే, తారక్ సెట్ లో అందరికీ దగ్గరయ్యాడని చెప్తున్నారు. షూటింగ్ దశలో ఉండగా తన కో ఆర్టిస్టులు సైతం తారక్ తో సెల్ఫీలు దిగుతూ సోషల్ సైట్స్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హీరో అజయ్ సైతం తన గారాలపట్టీతో కలిసి తారక్ తో ఫోటోకి ఇలా ఫోజులిచ్చాడు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jr ntr  samatha  nithya menon  mohanlal  ajay villian  unni mukundan  jr ntr janatha garage  

Other Articles