heroine dhansika naturally hair cut for movie kabali

Heroine dhansika naturally hair cut for movie kabali

kabali heroine, kabali dansika, dansika movies, kabali movie, kabali dhansika movies, kabali ticekts, kabali booking, kabali movie, kabali telugu online, kabali lady don, lady don chatector dansika

actress dhansika naturally hair cut for movie kabali. kabali movie is very special for her carrer she is saying.

కబాలి కోసం సాహసం చేసింది...!!

Posted: 07/09/2016 11:18 AM IST
Heroine dhansika naturally hair cut for movie kabali

తమిళంలో ఎంతో బిజీగా ఉన్నా కూడ డైరెక్టర్ రంజిత్ సార్ పిలవగానే వెంటనే ఆయన ఆఫీసుకు వెళ్లానని, సినిమాలో క్యారెక్టర్ అయిన లేడీ డాన్ గురించి చెప్పి, జుట్టు కత్తిరించుకోవాలని చెప్పారని, అప్పటికప్పుడు కొంచెం ఆలోచించినా కూడ క్యారెక్టర్ బాగా నచ్చి సినిమాకి ఓకే చెప్పానని చెప్తోంది హీరోయిన్ దన్షిక. ఈ అమ్మడు తమిళంలో పేరాణ్మై, అరవాన్, పరదేశి సినిమాల్లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటికే రెండు మూడు సినిమాల్లో బిజీగా ఉంది దన్షిక. ఆ తర్వాత రంజిత్ గారు స్వయంగా ఫోన్ చేసి నువ్వు రజనీకాంత్ సినిమా కబాలిలో సెలెక్ట్ అయ్యావ్ అని చెప్పగానే ఆనందమేసిందని చెప్తోంది.

సాధారణంగా హీరోయిన్స్ అంటేనే గ్లామర్ పాత్రలు చేయాల్సి ఉంటుంది. అందుకు వారి హెయిర్ స్టైల్ ఎంతో అవసరం. అలాంటిది కబాలి సినిమాకోసం ఈ అమ్మడు తన హెయిర్ ని కట్ చేసుకుని మరీ నటించింది. చాలామంది సన్నిహితులు విగ్ పెట్టుకోమని సలహాలు ఇచ్చినా డైరెక్టర్ చెప్పినట్లుగా న్యాచురాలిటీ కోసం సాహసం చేసింది ఈ చిన్నది. సినిమాలో నా పాత్ర చాలా కీలకమైనది అని, పదిసినిమాలకు వచ్చేపేరు ఈ ఒక్క సినిమాకే వచ్చిందని చెప్తోంది. రజనీకాంత్ గారంటే తనకి చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమని, మొదట్లో ఆయనతో నటించేందుకు భయపడుతుంటే ఆయన నాకు ధైర్యం చెప్పి ప్రోత్సహించారని చెప్తోంది దన్షిక.

కొసమెరుపు ఏంటంటే ఈ సినిమాకోసం రెండు , మూడు సినిమాల్లో ఆఫర్లు వదిలేసుకుని మరీ చేసిందట. ప్రస్తుతం కబాలి సినిమా వల్ల మంచి గుర్తింపు వచ్చిందని చెప్తోంది దన్షిక.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles