ప్రభాస్ అప్ కమింగ్ టైటిల్ | UV Creations registered Radha Premakatha for Prabhas

Uv creations registered radha premakatha for prabhas

UV creations Prabhas movie title, Radha Premakatha title for Prabhas, Radha Premakatha movie, Prabhas-Sujith title fixed

UV Creations registered Radha Premakatha for Prabhas.

ప్రభాస్ అప్ కమింగ్ టైటిల్

Posted: 07/09/2016 10:16 AM IST
Uv creations registered radha premakatha for prabhas

యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ పేరు తెలినీ వారు ఉండరు. స్టైలిష్ సినిమాలను తెరకెక్కించడంతోపాటు బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు భాగస్వాములుగా పని చేశారు. ఇక ఈ చిత్ర నిర్మాణ సంస్థ  వెనుక హీరో ప్రభాస్ ఉన్నాడన్నది ఓపెన్ సీక్రేట్. ప్రస్తుతం బాహుబలి-2 లో బిజీగా ఉన్న డార్లింగ్ తన తదుపరి చిత్రం ఈ బ్యానర్ లోనే అని ఎప్పటి నుంచో చెబుతున్నారు.

అయితే ఒకటి కాదు ఏకంగా రెండు ఉండబోతున్నాయని ఇప్పుడు మరో ప్రకటన చేశారు యూవీ బ్యానర్ వారు. అందులో రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఒకటి కాగా, మరోకటి ఇంకా ఎవరితోనో ఫిక్స్ కాలేదు. మరి ఆ సినిమాలకి టైటిల్ ఎలా ఉండనుందో అనే ఆసక్తితో యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఉన్నారు.

తాజాగా యూవీ క్రియేషన్స్ వారు ఫిల్మ్ ఛాంబర్ లో తాజాగా 'రాధా ప్రేమకథ' అనే టైటిల్ ను రిజిష్టర్ చేయించారు. టైటిల్ ను బట్టి ఇది ఒక సున్నితమైన ప్రేమకథ అనే కాదు లేడీ ఓరియంటల్ సినిమా అన్న అనుమానాలు కలగక మానవు. తన కెరీర్ లో ఇప్పటిదాక ఇలాంటి టైటిళ్ల జోలికి పోలేదు. పోనీ ప్రయోగం లాగా ఉంటుందని భావించి పెడితే మాస్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ లాంటి హీరోకి అది సూటవుతుందా? దాన్ని అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే అనుమానాలు మొదలవుతున్నాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UV creations  Prabhas  Sujith  Radha Premakatha  

Other Articles