hero sunil last chance to prove his market in tollywood

Hero sunil last chance to prove his market in tollywood

sunil movies, comedian sunil, sunil comedy, sunil next movies, jakkanna movie, jakkana movie tickets, jakkanna audio, chiru vs sunil, sunil chiru fan, hero sunil

sunil movie jakkanna releasing this month 22nd, in this case hole tollywood waiting for his success. if movie is fail sunil career in trouble

ఈసారి మిస్ అయితే... బ్యాక్ టు పెవిలియన్...!!

Posted: 07/09/2016 10:55 AM IST
Hero sunil last chance to prove his market in tollywood

తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా వచ్చి తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు సునీల్. తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. గత చిత్రాలు మిస్టర్ పెళ్లికొడుకు, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి సినిమాలు బాగా నిరాశపర్చడంతో ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు జక్కన్నగా ముందుకొస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ఆడియోని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో మన్నార్ చోప్రా సునీల్ తో హీరోయిన్ గా నటిస్తుండగా, వంశీ కృష్ణ ఆకెళ్ల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో చివరి పాట చిత్రీకరణ జరుపుకుంది. మరో రెండు రోజుల్లో సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని చెప్తున్నారు. ఈ సినిమాని ఈ నెల 22వ తేదిన గ్రాండ్ గా విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం సునీల్ ఈ సినిమాతో పాటుగా వీడు గోల్డ్ ఎహే అనే సినిమాలో కూడ నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు గనక ఫెయిల్ అయితే సునీల్ మళ్లీ బ్యాక్ టు పెవిలియన్ చేరుకోవాల్సిందేనని, మళ్లీ అతను కామెడీ వేషాలు వేస్తేనే మంచిదని సన్నిహితులు సలహాలు ఇస్తున్నట్లుగా సమాచారం. ఎందుకంటే కామెడీ చెయడంలో సునీల్ కి మంచి టైమింగ్ ఉందని, తనకి హీరోగా కంటే కూడ కమెడియన్ గానే ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్తున్నారు సినీ పండితులు. మరి ఈ రెండు సినిమాలు ఆశించిన ఫలితం రాకపోతే సునీల్ ని నమ్మి భారీ ప్రాజెక్ట్స్ తీయడానికి ప్రొడ్యూసర్స్ సైతం ముందుకు రారని చెప్తున్నారు సినీ ట్రేడ్ విశ్లేషకులు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunil tollywood  hero sunil  sunil movies  sunil upcoming movies  jakkanna telugu movie  

Other Articles